బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6) : కెప్టెన్ గా సింగర్ రేవంత్ (Singer Revanth).. ఇనయా (Inaya) ఎమోషనల్!

Advertisement
'గేమ్ ఆఫ్ గార్‌లాండ్స్' అనే టాస్క్ లో భాగంగా మొదట గీతూ (Geetu Royal) దండ అందుకొని.. ఇటూ అటూ తిరుగుతూ చివరికి సూర్యకు దండ వేసింది.

'బిగ్ బాస్ సీజన్ 6' (Biggboss Season 6)లో 33వ రోజు మరింత ఆసక్తితో  మొదలైన ఎపిసోడ్ కొత్త టాస్క్ లతో అలరించింది‌. అయితే ఈ ఎపిసోడ్ లో హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం రెండు లెవల్స్ లో పోటీ కొనసాగింది. బాలాదిత్య, ఆర్జే సూర్య, సింగర్ రేవంత్ (Singer Revanth) మొదటి లెవల్ లో గెలిచారు. రెండో లెవల్ కు వెళ్ళిన ఈ ముగ్గురికి 'గేమ్ ఆఫ్ గార్‌లాండ్స్' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. 

ఇందులో భాగంగా "ఏ కంటెస్టెంట్ కెప్టెన్ అవ్వాలనుకుంటారో వారి మెడలో మిగతా హౌస్ మేట్స్ బంతిపూల మాల వేయాలి. ఎక్కువ బంతిపూల మాలలు ఎవరికి వస్తాయో, వారే ఈ వారం కెప్టెన్  అవుతారు" అని బిగ్ బాస్ వివరించాడు.

Advertisement

ఈ సంద‌ర్భంగా గ‌త త‌ప్పుల‌ను మ‌ర‌చిపోయి త‌న‌కు మ‌ద్ధ‌తు ఇవ్వ‌మ‌ని గీతూను బాలాదిత్య (Baladitya) కోరాడు. తాను కెప్టెన్ అయితే ఇనాయా ఎక్కువ‌గా సంతోషిస్తుంద‌ని సూర్య ఫ‌న్నీగా యాక్టింగ్ చేస్తూ క‌నిపించాడు. ఈ క్రమంలో సూర్య‌ (RJ Surya), రేవంత్‌, బాలాదిత్య ముగ్గురూ క్యాంపెయిన్ చేస్తూ క‌నిపించారు.

ఇక, 'గేమ్ ఆఫ్ గార్‌లాండ్స్' అనే టాస్క్ లో భాగంగా మొదట గీతూ (Geetu Royal) దండ అందుకుంది. దండ పట్టుకుని ఇటూ అటూ తిరుగుతూ చివరికి సూర్యకు దండ వేసింది. రాజశేఖర్ దండను బాలాదిత్యకు వేశాడు. మొదట్లో ఎవరూ రేవంత్ కు సపోర్ట్ చేయలేదు. చివరలో వరుసగా దండలు రేవంత్ మెడలో పడ్డాయి.

శ్రీ సత్య (Sri Satya) బాలాదిత్యకు దండ వేసింది. అర్జున్, శ్రీహాన్, మెరీనా, ఆదిరెడ్డి రేవంత్‌కే ఓటేశారు. ఎక్కువ మంది రేవంత్‌కే వేయడంతో ఆయన కెప్టెన్ అయ్యాడు. దాదాపు ఎనిమిది మంది రేవంత్ కెప్టెన్ కావటానికి దండేసి మరి మద్దతు తెలిపారు. దీంతో వాష్ రూమ్‌కి వెళ్లాక కాస్త ఎమోషనల్ అయ్యాడు రేవంత్. అనంతరం హౌస్ లో ఎన్నికైన కొత్త కెప్టెన్ రేవంత్ కి కంటెస్టెంట్స్ అందరు చప్పట్లతో శుభాకాంక్షలు తెలిపారు.

Read More: Big Boss Season 6: కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే గీతూ రాయల్ (Geetu Royal) విన్నయ్యే చాన్స్!

Credits: Instagram
Advertisement
You May Also Like These
Advertisement