Anaya's Tutorial: రెజీనా ప్రధాన పాత్రలో 'అన్యస్ ట్యుటోరియల్' వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఖరారు..!

Advertisement
అన్యస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్ పోస్టర్ (Anya's Tutorial Web Series Poster)

Anya's Tutorial: ప్రస్తుతం ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ దిగ్గజ సంస్థలన్నీ సినిమాలకు ధీటుగా బలమైన కంటెంట్ తో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాయి. తెలుగులో తొలి ఓటీటీ అయిన ఆహా (Aha OTT) నుంచి కూడా అనేక వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ కి రంగం సిద్ధం అయింది. 

ఈ నేపథ్యంలోనే బాహుబలి ఫ్రాంచైజీని నిర్మించిన ఆర్కా మీడియా, అన్యస్ ట్యుటోరియల్ (Anya's Tutorial) పేరుతో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ కోసం OTT ప్లాట్‌ఫారమ్ ఆహాతో జతకట్టింది. ఈ సీరీస్ తెలుగు మరియు తమిళ భాషల్లో రానుంది. రెజీనా కసాండ్రా మరియు నివేదిత సతీష్ (సుజల్ ఫేమ్) ఈ సీరీస్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

Advertisement

సైబర్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌ను జూలై 1, 2022న ఆహా వీడియో లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అన్యస్ ట్యుటోరియల్, ఏడు ఎపిసోడ్‌ల సిరీస్‌కి పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌కు సౌమ్య శర్మ కథను అందించగా, విజయ్ కె చక్రవర్తి కెమెరా క్రాంక్ చేయగా, అరోల్ కొర్రేలి సంగీతం అందించారు. కాగా, అభిమానుల కోసం ఆహా వారు ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయబోతున్నారు.  

రెజీనా (Regina Cassandra), నివేదిత ఈసిరీస్ లో అక్కా చెల్లెల్లు గా నటించారు. సైబర్ టచ్ తో సాగే ఈ సిరీస్ లో హార్రర్ సన్నివేశాలు భయంకరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. హార్రర్ చిత్రాల ప్రియులకు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది అని అంటున్నారు. అక్కా చెల్లెళ్ళ మధ్య ఎం జరిగింది? సైబర్ ప్రపంచం లోకి హర్రర్ ఎలా వచ్చింది అనే అంశాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఆర్కా  మీడియా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ హర్రర్ చూపించాలంటే కష్టం. కానీ అందరికీ ఇదే నచ్చుతుంది. ఈ కథ వినగానే వెబ్ సిరీస్ రూపంలో చిత్రీకరించాలని అనుకున్నట్లు శోభు తెలిపారు. 

Read More: పుస్తకాల కంటే స్క్రిప్టులే ఎక్కువగా చదువుతున్నా: రెజీనా కాసాండ్రా (Regina Cassandra)

Advertisement
You May Also Like These
Advertisement