బిగ్ బాస్ (Telugu Biggboss) హౌస్ నుంచి వచ్చాక చాలా మంది సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. యాంకర్ భానుశ్రీ (Bhanu Shree) కూడా బిగ్ బాస్ నుంచి వచ్చాకే బాగా పాపులర్ అయింది. పలు సినిమాలు, సీరియల్స్ లో సహాయనటిగా కనిపించి, బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈ నటి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల 'మౌనం', 'నల్లమల' వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి ఫ్యాన్స్‌ను అలరించింది.
ప్రస్తుతం నటిగా, హీరోయిన్‌గా కెరీర్‌లో బిజీ అయిపోయిన భాను శ్రీ (Bhanu Shree) అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. కాగా, ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
బుల్లి తెర మీద అల్లరి చేస్తూ తన గొంతుతో అందరిని ఆటపట్టించే భాను (Bhanu Shree) ఇప్పుడు పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమెను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు? అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు నెటిజన్స్. అయితే తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే అతడి గురించి భాను శ్రీ స్వయంగా చెప్పింది.
ఓ వ్యక్తి వల్లే తాను ఇలా ఉన్నానని, అతనే హైదరాబాద్‌లో తనకంటూ ఒకరు ఉన్నారనే ధైర్యం ఇచ్చాడని ఓ షోలో భాను చెప్పింది. ఒకానొక సమయంలో తన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయకపోయినా అతను తనకు సపోర్ట్ గా నిలబడ్డాడని పేర్కొంది. అయితే, పెళ్లి వార్తలపై భాను శ్రీ (Bhanu Shree) మాత్రం ఇప్పటిరవరకు స్పష్టత ఇవ్వలేదు.
Follow Us