Vaishnavi Chaitanya: బిగ్ బాస్ కు వెళ్లే ప్రసక్తే లేదు.. సోషల్ మీడియా సెన్సేషన్ వైష్ణవి చైతన్య కీలక వ్యాఖ్యలు!

Advertisement
వైష్ణవి చైతన్య (Vaishnavi chaitanya)

Vaishnavi Chaitanya: యూట్యూబర్ వైష్ణవి చైతన్య.. సోషల్ మీడియా యూజర్లకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని సాంగ్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయింది వైష్ణవి చైతన్య. వీటితో వచ్చిన ఫేమ్ తో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది ఈ బ్యూటీ.  

మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన వైష్ణవి చైతన్య (Vaishnavi chaitanya) అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది. మొదట డబ్ స్మాష్ వీడియోలతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు చేస్తూ తన అందాలతో మరింత ఆకట్టుకుంది.అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించింది. యూట్యూబ్ లో కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఇక మోడల్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది.

Advertisement

కాగా, వైష్ణవి చైతన్య ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) సరసన 'బేబీ' సినిమాలో నటిస్తోంది. దీంతో బాగా బిజీ అయిపోయింది వైష్ణవి. వైష్ణవి గతంలో షణ్ముఖ్ తో సాఫ్ట్‌వేర్ డెవలపర్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ బాగా పాపులర్ అవ్వడంతో వైష్ణవికి మంచి పేరు వచ్చింది. ఇక ఈమెకు యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ తో పాటు 400k సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 700k ఫాలోవర్స్ ఉన్నారు. వైష్ణవి ఎక్కువగా ఇంట్లో కంటే నెట్టింట్లో బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది.

మరోవైపు.. వైష్ణవి చైతన్య కేవలం వెబ్ సిరీస్ ల తోనే కాకుండా పలు ఫోటో షూట్లతో కూడా బాగా బిజీగా ఉంటుంది. ఇక ఆ ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో బాగా షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ నటి బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో అడుగు పెట్టనుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్పందించింది వైష్ణవి. 'బేబీ' (Baby Movie) చేస్తుండగా ఇంకా బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్తానని ప్రశ్నించింది. సినిమా పూర్తయ్యాక సైతం బిగ్‌బాస్‌ షోకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

Read More: Agent Anand Santosh Trailer: 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన షణ్ముఖ్ జస్వంత్..!

Advertisement
You May Also Like These
Advertisement