తెలుగు బుల్లితెర పై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ (Telugu Boggboss) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. టీవీలో ఈ షో ప్రసారం అవుతుందంటే చాలు.. ఏ పనినైనా పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోతారు బుల్లితెర ఆడియన్స్. ఈ రియాలిటీ షో అంటే అంతిష్టం ప్రేక్షకులకు. కంటెస్టెంట్లు ఆడే టాస్కులు, గేములు, కోపతాపాలు, నవ్వులు, లవ్ స్టోరీలు, కొట్లాటలు.. ఇలా అన్నీ ఒకేచోట దొరుకుతాయి కాబట్టే బిగ్‌బాస్ షోకు ఫ్యాన్స్ ఎక్కువ.
కాగా.. ఇప్పటివరకు ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఆరో సీజన్‌లో అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే ప్రోమో (Biggboss Season 6 Promo) ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీరేనంటూ ఇప్పటివరకు కొంతమంది పేర్లు బాగానే ప్రచారంలోకి వినిపించాయి. అలా ప్రచారంలోకి వచ్చిన పేర్లలో జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి (Chalaki Chanti), ఫేమస్ సింగర్ మోహన్ భోగరాజు (Mohana Bhogaraju) పేర్లు కూడా ఉన్నాయి. అయితే, మోహన్ భోగరాజు ఈ షోలో పాల్గొనడం లేదని ఇదివరకే క్లారిటీ ఇచ్చేసింది. కానీ, చలాకీ చంటి మాత్రం బిగ్ బాస్ లో పాల్గొనడం గురించి కాస్త వెరైటీగా స్పందించారు.
చలాకి చంటి (Chalaki Chanti) మాట్లాడుతూ.. బిగ్ బాస్ టీం తో ఇప్పటికే చర్చలు కూడా అయిపోయాయని తెలియజేశాడు. కానీ రెండు విషయాలు మాత్రం మిగిలిపోయాయని పేర్కొన్నాడు. ఆ రెండు విషయాలు తెలిస్తే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తానని చంటి తెలిపాడు. మరి చలాకీ చంటి విధించిన ఆ షరతులకు బిగ్ బాస్ బృందం అంగీకరిస్తుందా లేదా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లలో కూడా ఎంతమంది బిగ్ బాస్ షోలో పాల్గొంటారన్నది చూడాలి. ఇప్పటికే ఆదిరెడ్డి, గీతూరాయల్, శ్రీహాన్, శ్రీసత్య, చలాకీ చంటి, దీపిక పిల్లి (Deepika Pilli), రేవంత్, అర్జున్ కల్యాణ్, ఆరోహి రావు, వాసంతి కృష్ణన్, సుదీప హౌస్‌లో అడుగు పెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఆర్జే సూర్య, నేహా చౌదరి, హీరోయిన్ ఇనయ సుల్తానా, అప్పారావు, తన్మయిలను బ్యాకప్ లిస్టులో చేర్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక, ఈసారి కూడా నాగార్జుననే బిగ్ బాస్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోపై ఇతర హీరోలు ఆసక్తి చూపించకపోవడంతో నాగార్జునని (Host Nagarjuna) హోస్టుగా కొనసాగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
Follow Us