Big Boss Season 6: కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే గీతూ రాయల్ (Geetu Royal) విన్నయ్యే చాన్స్!

Advertisement
బిగ్‌బాస్ (Biggboss Season 6) షోలపై రివ్యూలు చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు గీతు (Geetu Royal).

బిగ్‌బాస్ షో (Biggboss Season 6) విజయవంతంగా రన్ అవుతోంది. సక్సెస్‌ఫుల్‌గా ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇటీవలే ఆరో సీజన్ కూడా మొదలై.. టెలివిజన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇప్పుడు ఈ సీజన్ మూడో వారం పూర్తి చేసుకుని.. నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. హౌజ్‌‌లోకి 21 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. వారిలో టాప్–5 పోటీదారుల్లో ఒకరిగా గీతూ రాయల్ దూసుకెళ్తున్నారు. అసలు ఎవరీ గీతూ రాయల్? ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 

బిగ్‌బాస్ హౌజ్‌‌లో ఎనిమిదో పోటీదారుగా ఎంట్రీ ఇచ్చారు యూట్యూబర్ గీతూ రాయల్. బిగ్‌బాస్ షోలపై రివ్యూలు చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు గీతు. హౌజ్‌‌లో చిత్తూరు చిరుత అంటూ తెగ హల్‌చల్ చేస్తున్నారు. 

Advertisement

గీతూ రాయల్ 1997వ సంవత్సరం, ఆగస్టు 27న జన్మించారు. చిత్తూరులో పుట్టి, పెరిగిన ఆమె అసలు పేరు గ్రీష్మ లేఖ. తండ్రి పేరు శేఖర్. ఆయన వ్యాపారి. కానీ బిజినెస్‌లో భారీగా నష్టాలు రావడంతో గీతు తల్లి సుధా రాజ్యం కుటుంబ బాధ్యతల్ని తీసుకున్నారు. తల్లి  సుధకు నంద్యాలలో ఉద్యోగం రావడంతో గీతు ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ అయ్యింది.

చిత్తూరు, నంద్యాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న గీతు.. బెంగళూరులో డిగ్రీ చదివారు. ఆ తర్వాత ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు.  ఆ జాబ్ నచ్చకపోవడంతో వదిలేసి.. బిగ్ బాస్ వీడియోలపై రివ్యూలు చెబుతూ పాపులారిటీ సంపాదించారు. ‘గలాటా గీతూ’గా బాగా ఫేమస్ అయ్యారు.

యూట్యూబర్‌గా, టిక్ టాక్ స్టార్‌గా గీతూ రాయల్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిత్తూరు యాసతో ఆమె మాట్లాడే తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక, జబర్దస్త్ లో చేసిన ‘పుష్ప’ మూవీ స్కిట్ కూడా బిగ్‌బాస్ హౌజ్‌లో ఆమె అడుగుపెట్టేందుకు ఒక కారణమనే చెప్పాలి. ఈ స్కిట్‌తో గీతూకు పాపులారిటీ మరింత పెరగడంతో బిగ్‌బాస్ ఆఫర్ వరించింది. వికాస్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

హౌజ్‌‌లోనూ ‘గలాటే’

బిగ్‌బాస్ హౌజ్‌లో గీతూ రాయల్ ప్రవర్తనపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి అందరితో గొడవలు పెట్టుకుంటుండటంతో గీతు కాంట్రవర్సీ క్వీన్‌గా మారారు. ఆమె గేమ్ ఆడుతున్న తీరుపై పెద్దగా కంప్లయింట్స్ రావడం లేదు. కానీ మిగిలిన కంటెస్టెంట్లతో ప్రవర్తిస్తున్న తీరుపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఆటను తనకు నచ్చినట్లు ఆడే గీతు.. ప్రతి గేమ్‌ను బాగా ఆడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఇక ముందు కూడా ఆమె ఇలాగే ఆడుతూ, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు.

Read more: Big Boss Season 6: మెయిన్ కంటెస్టెంట్‌గా మారుతున్న కామన్ మ్యాన్ ఆదిరెడ్డి (Adireddy)!

Advertisement
You May Also Like These
Advertisement