Rashmi Gautam: జబర్దస్త్‌కు (Jabardasth) కొత్త యాంకర్‌ వచ్చే వరకు నన్ను భరించండి.. రష్మీ గౌతమ్ పోస్ట్ వైరల్!

Advertisement
'జబర్దస్త్' (Jabardasth) కి తిరిగి స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. నేను ఈ ప్రత్యేకమైన షో చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను.

బుల్లి తెర హాట్‌ యాంకర్‌ రష్మి గౌతమ్ (Rashmi Gautam) వరుసగా కొత్త షోలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు యాంకర్‌గా ఉంది. ఇక, ఈ మధ్య సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) వెళ్లిపోవడంతో శ్రీదేవీ డ్రామా కంపెనీకి సైతం యాంకర్‌గా మారింది. మరో హాట్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆమె స్థానంలో ఎవరు వస్తారా? అని అందరూ తెగ ఆత్రుతగా చూస్తున్నారు. 

ఈ క్రమంలో జబర్దస్త్ కు కొత్త యాంకర్ ఎవరు వస్తున్నారు.. అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. కొంత మంది నెటిజన్లు జబర్దస్ద్‌కు కొత్త యాంకర్‌గా మంజూష వస్తుందని సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా.. మరికొంత మంది మాత్రం వేరే కొత్త యాంకర్‌ను దించనున్నారని అన్నారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జబర్దస్త్‌, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు (Extra Jabardasth) కూడా రష్మినే యాంకర్‌గా కొనసాగుతారని తెలుస్తోంది.

Advertisement

దీనికి సంబంధించి రష్మి స్వయంగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ.. కొత్త యాంకర్ దొరికే వరకు తాను జబర్దస్త్‌కు యాంకర్‌గా కొనసాగడానికి సంతోషంగా రెడీగా ఉన్నానని.. కొంతకాలం నన్ను భరించండి అంటూ పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నిర్వహకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది రష్మి. 'జబర్దస్త్' (Jabardasth) కి తిరిగి స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. నేను ఈ ప్రత్యేకమైన షో చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఏం చేయడానికైనా రెడీగానే ఉంటాను అని అందులో పేర్కొంది.

ఇదిలా ఉంటే.. రష్మి ఓ వైపు ఈ టీవీలో వచ్చే జబర్దస్త్ లో యాంకరింగ్, ఢీ షోకు (Dhee Dance Show) మెంటరింగ్ చేస్తూనే.. నందు హీరోగా వస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే పేరు పెట్టింది చిత్రబృందం. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని ప్ర‌వీణ్ ప‌గ‌డాల నిర్మించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ టీజర్ విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది.

Read More: Hyper Aadi & Varshini: బుల్లితెర సెలబ్రిటీలు హైపర్ ఆది, వర్షిణి ప్రేమలో ఉన్నారా.. ఆ పోస్ట్‌కు అర్థమేంటి?

Credits: Instagram
Advertisement
You May Also Like These
Advertisement