తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) మొదలై ఇప్పటికే 45రోజులు పూర్తయింది. ఈ సీజన్ అన్ని సీజన్ల కంటే చాలా వరస్ట్ గా ఉన్నట్టు షో ప్రారంభమైనప్పటినుంచి ప్రేక్షకుల నుంచి వినబడుతున్న టాక్. ఈ విషయాన్ని ప్రేక్షకులే కాదు నాగార్జున కూడా ఒప్పుకున్నారు. గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి అత్యంత దారుణమైన రేటింగ్స్ వస్తున్నాయి. షోని కంటెస్టెంట్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తూ రేటింగ్స్‌ను అటకెక్కించారు.
బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) ప్రారంభం నుంచి ఇదే తంతు కొనసాగుతుండటంతో బిగ్‌బాస్ కళ్లు తెరిచాడు. దీంతో హౌస్ మేట్స్ అందరినీ నిలబెట్టి మరీ కడిగేశాడు. అందరు వేస్ట్.. బయటకు వెళ్లిపోండి అంటూ ఫైర్ అయ్యాడు. మంగళవారం రిలీజ్ చేసిన ప్రోమోలో (promo) ఈ విషయాన్ని బిగ్ బాస్ ప్రస్తావించాడు.
ఇకపూర్తి వివరాల్లోకి వెళ్తే.. ‘ఇంటిసభ్యుల నిర్లక్ష్యం, టాస్కుల పట్ల నిర్లక్ష్యం, బిగ్ బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం, మీ నిర్లక్ష్యం ప్రేక్షకులనే కాదు బిగ్ బాస్ ని కూడా నిరాశపరిచింది. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరాశపరుస్తున్న కారణంగా ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రద్దు చేస్తున్నాం. ప్రేక్షకుల పట్ల, ఈ షో పట్ల గౌరవం లేదని మీరు నమ్మినట్లయితే తక్షణమే ముఖద్వారం నుంచి బిగ్ బాస్ ఇంటిని వదిలి బయటకెళ్లిపోవచ్చు’ అని హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత శ్రీహన్ (Srihan) తన పర్ఫామెన్స్ చూపించాడు. కెమెరా దగ్గరకు వెళ్లి.. టైంకి తినాలి.. సోది ముచ్చట్లు పెట్టుకోవాలి.. ముందు వాళ్లకి బిగ్ బాస్ షో గురించి చెప్పండి బిగ్ బాస్.. మినిమమ్ క్లారిటీ లేదు.. ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ఆరో సీజన్ ఏ మాత్రం ఆసక్తిగా ఉండట్లేదు. గీతూ (Geetu Royal), రేవంత్ (Singer Revanth), శ్రీహాన్ లాంటి కొందరు తప్పించి మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఏదో హౌసులో ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. హోస్ట్ నాగార్జున కూడా ఇదే విషయమై కంటెస్టెంట్స్ అందరినీ హెచ్చరించాడు కూడా. అయినా సరే హౌస్ మేట్స్ ప్రవర్తనలో మాత్రం మార్పు రావట్లేదు. దీంతో ప్రేక్షకులు ఈ షోని లైట్ తీసుకుంటున్నారు.
Follow Us