తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో (Biggboss Season 6) ఇంటి సభ్యులకు బిగ్ బాస్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ పై బిగ్ బాస్ అసహనం చూపుతూ డోర్లు తెరిచి ఇష్టం లేనివాళ్ళు వెళ్లిపోండి అంటూ కెప్టెన్సీ టాస్కులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. హౌస్ లో చిల్ అవడానికి మాత్రమే వచ్చినట్లు మీ ఆట ఉందని ఇంటి సభ్యులకు బిగ్ బాస్ క్లాస్ తీసుకున్నారు. అయినా గాని ఇంటి సభ్యులలో మార్పు రాకపోవడంతో ఏడో వారం ఆటలో సభ్యులను బిగ్ బాస్ ఆడుకుంటున్నారు.
తాజాగా విడుదలైన ప్రోమో (Promo) చూస్తే కంటెస్టెంట్లపై బిగ్ బాస్ కోపం తగ్గినట్లులేదు. దొంగల టాస్క్ పెట్టి, హౌస్ ఉన్న వాళ్ళకు చుక్కలు చూపించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ లో దొంగలు పడతారు. ఇంట్లో ఉన్న ఆహారమంతా తీసుకొని వెళ్తారు దొంగలు. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు ఆకలితో అలమటించిపోయారు.
దొంగలు బిగ్ బాస్ హౌస్ (Biggboss House)లో కనీసం పంచదార, ఉప్పు కూడా మిగిలించలేదు. రోజు మొత్తంలో ఒక్క ముద్ద అన్నం కూడా దొరకకపోవడంతో హౌస్ మేట్స్ మొత్తం ఆకలితో అలమటిస్తూ నీరసించి కూర్చున్నారు. అలాంటి సమయం లో బిగ్ బాస్ వాళ్లకి అదిరిపోయే టాస్కుని ఇచ్చాడు. ఈ టాస్కు చూస్తే ఇది కదరా అసలు ఆట అని ప్రేక్షకులకు అనిపించక మానదు.
టాస్కులు సరిగా ఆడకుండా బద్దకంగా ఉంటున్న ఇంటి సభ్యులకు ఆకలి మంటలు పుట్టించేలా చేసి.. పోరాడి గెలిచి ఆహారం తినమని చెప్పారు బిగ్ బాస్. ఇంటి సభ్యులను రెండు వర్గాలుగా విభిజించి పోటీలు పెట్టారు. అందులో గెలిచిన టీమ్‌కే ఆహారం ఇస్తున్నారు. ఈ ప్రోమోలో చపాతీ, ఆలూ కర్రీ బహుమతిగా పెట్టారు. అది చూడగానే శ్రీ సత్య (Sri Satya) ‘ఫుడ్ వచ్చేసింది,ఫుడ్ వచ్చేసింది’ అంటూ ఎగిరి గంతులేస్తుంది.
కానీ బిగ్ బాస్ (Telugu Biggboss) అంత తేలికగా ఏమి ఇవ్వడు కదా.. అన్నం తినాలంటే కచ్చితంగా దానికోసం పోరాడాల్సిందే అంటూ కొత్త షరతులు పెట్టాడు. దీనికోసం ఇంటి సభ్యులు రెండు గ్రూప్స్ గా విడిపోయి కబడ్డీ ఆడాలి. గెలిచిన వారికే అన్నం దక్కుతుంది అంటాడు బిగ్ బాస్. అలా ఈరోజు టాస్కు ఆసక్తికరంగా సాగబోతోంది.
అయితే గెలిచిన సభ్యులు ఓడిపోయిన సభ్యులకు ఫుడ్ పెట్టకూడదని కండిషన్ పెట్టారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాన్ని గీతు రాయల్ (Geetu Royal), ఆది రెడ్డి ఉల్లంఘించారు. గెలిచిన టీం మెంబెర్ అయిన ఆదిరెడ్డి ప్లేటులోని ఆహారాన్ని గీతూ తినేసింది. దీంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యి గీతు రాయల్, ఆది రెడ్డి చేత అంట్లు తోమించారు. బయట నుంచి గిన్నెలు పంపించి మరి తోమాలని ఆదేశించి పనిష్మెంట్ ఇచ్చారు.
Follow Us