నేటినుంచే బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6).. ఇప్పటికే పూర్తయిన కంటెస్టెంట్ల ఎంట్రీ షూటింగ్..!

Advertisement
అక్కినేని నాగార్జున (Nagarjuna)హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ (Biggboss Season 6) షో ఆదివారం నుంచి ప్రేక్షకులముందుకు రానుంది.

తెలుగు బిగ్ బాస్ (Telugu Biggboss) ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేసాయి. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ప్రస్తుతం 6వ సీజన్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో, లోగో విడుదల చేయగా వైరల్ అయ్యాయి. కాగా, ఇటీవలే బిగ్ బాస్ ఫస్ట్ గ్లింప్స్ (Biggboss Glimpse) విడుదల చేసిన తరుణంలో ఆ వీడియోలో హౌస్ మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబయినట్లు తెలుస్తోంది.

అయితే, రాబోయే బిగ్ బాస్ 6వ సీజన్  పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సీజన్ ​లో సరికొత్తగా రూల్స్ తీసుకొచ్చారని టాక్ వినిపిస్తోంది. నామినేషన్ ప్రక్రియ, శిక్షలను విభిన్నంగా ఏర్పాటు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక, ఆరో సీజన్‌లో జరిగే నామినేషన్స్ ప్రక్రియలోనూ పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అక్కినేని నాగార్జున (Nagarjuna)హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఆదివారం నుంచి ప్రేక్షకులముందుకు రానుంది. కంటెస్టెంట్‌లను పరిచయం చేసే ఈవెంట్‌కు సంబంధించిన పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. శనివారం ఉదయం నుంచే తొలి ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్‌ పనులు మొదలయ్యాయి. సాయంత్రానికి సర్వాంగ హంగులతో ఈ తొలి ఎపిసోడ్‌ పూర్తయిందని సమాచారం అందుతోంది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) లోకి ఎంటరయ్యే ఫైనల్ లిస్ట్ ఇదే అని కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం 20 మంది పేర్లు బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ 20 మంది పేర్లు.. 

  • గీతూ రాయల్‌
  • ఆదిరెడ్డి, 
  • సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌, 
  • యాంకర్‌ నేహా చౌదరి, 
  • ఆర్జే సూర్య, 
  • కమెడియన్‌ చంటి, 
  • నటుడు బాలాదిత్య, 
  • షాన్ని, 
  • సింగర్‌ రేవంత్‌, 
  • నటి సుదీప(పింకీ), 
  • యాంకర్‌ ఆరోహీ రావ్‌, 
  • సీరియల్‌ నటి శ్రీ సత్య, 
  • కీర్తి, 
  • ఇనయా సుల్తానా, 
  • లేడీ కమెడియన్‌ ఫైమా, 
  • నటి వసంతి, 
  • అర్జున్‌, 
  • రాజశేఖర్‌, 
  • రియల్‌ కపుల్‌ రోహిత్‌, మరీనా.

వీరితోపాటు వైల్డ్ కార్డు రూపంలో మరికొంతమంది బిగ్ బాస్ హౌస్ లో మధ్యలో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Read More: Biggboss Season 6: బిగ్ బాస్ సీజన్-6లో పాల్గొనే కంటెస్టెంట్ల ఫైనల్ లిస్టు ఇదే.. మరోసారి ఎంట్రీ ఇచ్చేది వీరే!

 

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement