సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా మైఖేల్. విజయ్ సేతుపతి, వరుణ్ సందేష్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మైఖేల్ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మైఖేల్ సినిమా టీజర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తే తెలుస్తోంది. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న మైఖేల్ సినిమా టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సందీప్ కిషన్ చెప్పిన డైలాగులు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది.
ఇంతకుముందెన్నడూ కనిపించని ఇంటెన్సివ్ లుక్‌లో సందీప్ కిషన్ ఆకట్టుకుంటున్నారు. ఆయన డైలాగ్ డిక్షన్ బాగుంది. యాక్షన్ సీన్లలో విజయ్ సేతుపతి అదరగొడుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పి.రామ్‌మోహన్ రావు, భరత్ చౌదరి సంయుక్తంగా మైఖేల్ సినిమాను నిర్మిస్తున్నారు. 1:34 నిమిషాల టీజర్‌లో డైలాగులు, బీజీఎంను మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగులు చెప్పేటప్పుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) వాయిస్ స్టన్నింగ్ ఉంది.
టీజర్‌లో డైలాగులు..
మైఖేల్.. వేటాడడం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి మైఖేల్.. వెంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడడం తెలియాల్సిన పని లేదు మాస్టర్
మైఖేల్ మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం మైఖేల్.. నేను మనిషిగానే ఉంటాను మాస్టర్.. దేవుడు అవ్వాలనే ఆశ లేదు
Read More : ధనుష్ (Dhanush)‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలోని కీలకపాత్రలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్?
Follow Us