Ra Ra Reddy Song: 500 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న 'మాచర్ల నియోజకర్గం' (Macherla Niyojakavargam) సాంగ్..!

'రారా రెడ్డి' (Ra Ra Reddy Song) అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతోంది.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Hero Nithiin) ఎప్పటిక‌ప్పుడు విభిన్న క‌థ‌ల‌తో సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో మరో మాస్ కమర్షియల్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకర్గం' (Macherla Niyojakavargam) ఆగస్టు 12న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. 

ఇక, ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ (Macherla Niyojakavargam Trailer) అటు మాస్‌లోనూ ఇటు క్లాస్‌లోనూ అంచ‌నాలు పెంచేసింది. ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. మాస్ ఎలిమెంట్స్‌తో వావ్ అనిపించి.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.  

ఇక, ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మాస్ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'రారా రెడ్డి' (Ra Ra Reddy Song) అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చాలా వైరల్ గా మారిపోతోంది. ముఖ్యంగా యువత 'రారా రెడ్డి' స్టెప్పులతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు.. రారా రెడ్డి పాట ఇంటర్నెట్ ప్రపంచంలో మరొక సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం 'రారా రెడ్డి' పాట యూట్యూబ్‌లో మిల‌య‌న్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ పాట‌లో 'జ‌యం' (Jayam Movie) సినిమాలోని ‘రానురానంటూనే చిన్నోదో’ పాట ప‌ల్ల‌వి బిట్ సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇప్పుడు ఈ పాట అరుదైన ఘనత సాధించింది. ఈ సాంగ్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లన్నింటిలో 500 మిలియన్లకు పైగా వ్యూస్‌ను కొల్లగొట్టి ట్రెండింగ్ నిలిచింది. 

ఇక, ఈ పాటలో హీరో నితిన్ డ్యాన్స్, అంజలి (Actress Anjali) గ్లామర్‌తో పాటు ‘రాను రాను అంటూనే చిన్నదో’ పాటలోని హుక్ లైన్ పాటను హైలైట్ చేశాయి. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పాట యూబ్యూట్, సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాను రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

'మాచర్ల నియోజకర్గం' సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Krithi Shetty) నితిన్ సరసన హీరోయిన్ గా చేస్తున్నారు. మరో హీరోయిన్‌గా కేథరిన్ (Catherine Tres) నటిస్తోంది. ఇక, ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.

Read More: Macherla Niyojakavargam Trailer: 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్.. డైలాగులతో అదరగొట్టిన నితిన్ (Nithiin)

Credits: Twitter
You May Also Like These