Virata Parvam: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) యాక్టింగే వేరే లెవల్‌లో ఉంటుంది. హీరోగానే కాకుండా విలన్ పాత్రల్లోనూ తన టాలెంట్‌ను చూపిస్తున్నారు. ప్రస్తుతం రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాట పర్వం సినిమా రిలీజ్ కానుంది. ఆ సినిమా ట్రైలర్‌ను కర్నూలులో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
విరాట పర్వం సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణలో జరిగిన నక్సలిజం పోరాటాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
కర్నూలులో విరాట పర్వం ట్రైలర్ రిలీజ్
Virata Parvam: విరాట పర్వం సినిమాను జూన్ 17న రిలీజ్ చేయనున్నారు. కరోనా కారణంగా చాలా రోజులు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.తాజాగా కర్నూలులో విడుదలైన విరాట పర్వం (Virata Parvam) ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో రానా చేసిన పనిని చూసిన ప్రేక్షకులు ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
'హీరోలంటే చాలా గ్రేట్' అని ఫీలవుతారు కొందరు. ఎందుకంటే తాము లీడ్ రోల్‌లో నటిస్తూ సినిమాను నడిపిస్తామనే భావం వారికి ఉంటుంది. కానీ రానా మాత్రం అలాంటి స్టార్ డమ్ ఫీలింగ్స్‌కి దూరంగా ఉంటారు. తెలుగు చలనచరిత్ర పరిశ్రమలో నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వంతో జీవనయానం సాగించిన మూవీ మొఘల్, మేటి ప్రొడ్యూసర్ అయిన రామానాయుడికి స్వయానా మనువడు రానా. ఆయన బాటలోనే తను కూడా నడుస్తున్నారు.
Rana Daggubati : రానా దగ్గుబాటి తండ్రి సురేష్ బాబు కూడా బడా నిర్మాతే. ఇక బాబాయ్ వెంకటేష్ టాప్ హీరో. ఇంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, రానా తన కుటుంబ సభ్యులను ఎంతో గౌరవిస్తారు. అలాంటి గౌరవమే తనతో కలిసి పనిచేసే తోటి నటీనటుల పట్ల కూడా రానా కలిగి ఉంటారు.
రానాపై ప్రశంసల వెల్లువ
ఇటీవలే జరిగిన విరాటపర్వం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం, ఎడతెరిపి లేకుండా జోరుగా కురిసిన గాలి వానతో చాలా ఇబ్బందులతో సాగింది. కానీ ప్రేక్షకుల కోసం ఈవెంట్‌ను ఆపేయకుండా, వానలో తడుస్తూ మరీ కార్యక్రమాన్ని కొనసాగించారు చిత్ర యూనిట్. అయితే హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడేటప్పుడు, వాన ఒక్కసారిగా ఎక్కువైంది.
రానా అప్పుడు అక్కడ ఓ గొడుగు ఉంటే, దానిని చేతిలోకి తీసుకున్నారు. సాయిపల్లవి తడవకుండా, ఆమె మాట్లాడుతున్నంత సేపు.. తనకు ఓపికగా గొడుగు పడుతూనే ఉన్నారు. ఇది చూసిన ప్రేక్షకులు రానా వ్యక్తిత్వం చాలా గొప్పదంటూ అభినందిస్తున్నారు. రానా చేసిన పనికి అక్కడ ఉన్న వారు, సాయి పల్లవి మాట్లాడుతున్నంత సేపు కేరింతలతో ఈలలు వేస్తూనే ఉన్నారు.
Virata Parvam : 'విరాటపర్వం' సినిమాలో నక్సలైట్ రవన్న పాత్రను రానా పోషించారు. ఈ పాత్ర చాలా విభిన్నమైన పాత్ర అని ఆయన తెలిపారు. రవన్న చేసే రచనలు పోరాట స్పూర్తిని నింపేలా ఉంటాయి. ఆ రచనలకు ఫిదా అవుతుంది వెన్నెల. వెన్నెల పాత్రలో నటించిన సాయిపల్లవి, ఆ క్యారెక్టర్‌కు 100 శాతం న్యాయం చేసిందని అంటున్నారు దర్శకులు. పోరుబాట పట్టిన రవన్న, వెన్నెల జీవన ప్రయాణం ఎలాసాగుతుందో తెలియాలంటే, ఈ సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.
Virata Parvam : 'విరాటపర్వం' సినిమాలో హీరోయిన్ ప్రియమణి (Priyamani) ఓ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి విరాట పర్వం (Virata Parvam) సినిమాను నిర్మించారు.
Read More: రానా నటించిన విరాట పర్వంలోని నగాదారిలో లిరికల్ సాంగ్ రిలీజ్
Follow Us