Advertisement

Sai Pallavai: 'గార్గి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో సాయిపల్లవి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బ్యూటీ!

Sai Pallavai: నాచురల్ బ్యూటీ సాయి పల్లవి వరుసగా తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిపంచేస్తోంది. ఆమె సినిమాలను ఎంచుకునే విషయంలో తన రూటే వేరు. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా సరే.. కథలో తనకు పెర్ఫామెన్స్ స్కోప్ ఉంటేనే నటిస్తుంది. ఎన్ని అవకాశాలు వచ్చిన సాయిపల్లవి మాత్రం మంచి పాత్రలు ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నటించిన . ఈ నెల 15న ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది. 

గౌతమ్ రామచంద్రన్ (Gautham Ramachandran) దర్శకత్వం వహించిన 'గార్గి' చిత్రంలో ఒక గ్యాంగ్ రేప్ కేసులో అన్యాయంగా ఇరుక్కున్న తండ్రిని విడిపించేందుకు కూతురు చేసే న్యాయ పోరాటాన్ని చూపించారు. ఈ మూవీకి ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది. నిజం కోసం పోరాడే యువతి పాత్రలో సాయి పల్లవి తన నటనతో మరోసారి తన సత్తా ఏంటో ఈ సినిమా ద్వారా నిరూపించుకుంది. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. 

కాగా, 'గార్గి' (Gargi Movie) చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లకు సాయి పల్లవి స్వయంగా వెళ్లి సందడి చేస్తోంది. చెన్నై, హైదరాబాద్ లోని పలు థియేటర్లను ఆమె సందర్శించారు. అంతేకాకుండా కొద్ది సమయం పాటు అభిమానుల కేరింతల నడుమ తన స్వయంగా సినిమాను వీక్షించింది. అనంతరం వారితో సరదాగా ముచ్చటించింది. అయితే, పలుచోట్ల అభిమానులు ఈలలు వేస్తూ సాయి పల్లవికి స్వాగతం పలికారు. ఇక తను కూడా ఓపికగా చాలా మందితో సెల్ఫీలు దిగింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు. కాగా, ఆమె వెంట దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ కూడా ఉన్నారు. 

చిన్నపిల్లలపై లైంగిక దాడులు కథాంశంగా  చేసుకుని సామాజిక చిత్రాన్ని తెరకెక్కించినందుకు డైరెక్టర్ గౌతమ్ తో పాటు సాయి పల్లవికి అన్ని భాషల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమా చూసిన తమిళ స్టార్ హీరో సూర్య (Hero Suriya), ఉదయనిధి స్టాలిన్ మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత గొప్పగా రచించి, గొప్పగా రూపొందించిన సినిమాగా ఇది గుర్తుండిపోతుందన్నారు. వారి సలహామేరకే అన్ని భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. 

Read More: నిజాలను నిర్భయంగా చెప్పిన కథ 'గార్గి' .. సాయిపల్లవి నటనా ప్రతిభకు మరో నిదర్శనం ఈ చిత్రం 

Advertisement
You May Also Like These
Advertisement