విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లైగర్'. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న 'లైగర్' సినిమా విడుదలైంది. ఇదే క్రమంలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పూరీ జగన్నాథ్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి సినిమా ఇది.
దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే 'లైగర్' సినిమా రిలీజ్ కాకముందే, వీరిద్దరి కాంబినేషన్‌లో 'జనగణమన' సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ప్రస్తుతం 'లైగర్' సినిమా హిందీలో మంచి వసూళ్లను రాబడుతోందని టాక్. రిలీజైన రోజే రూ.4 కోట్ల వరకు వసూళ్ల వర్షం కురిపించింది. అలాగే మూడో రోజు కూడా దాదాపుగా రూ.4.50 కోట్లు వసూలు చేసిందని టాక్.
బాలీవుడ్‌లో కూడా.
ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో మొదలైంది ఈ సౌత్ సినిమాల ట్రెండ్. కేజీఎఫ్, కేజీఎఫ్2, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలు హిట్ అయ్యాక, ఆ ట్రెండ్ మరింత పెరిగిందనే చెప్పుకోవాలి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమా కూడా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లోనే రిలీజైంది. విడుదలకు ముందే మంచి క్రేజీ ప్రాజెక్టుగా కితాబునందుకుంది.
కానీ ఇక్కడే ఓ విచిత్రం జరిగింది. తెలుగులో 'లైగర్'కు వచ్చిన నెగెటివ్ టాక్‌తో, హిందీలో ఈ చిత్రానికి భారీ నష్టాలు తప్పవని భావించారు. అయితే అనూహ్యంగా 'లైగర్' హిందీలో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ప్రస్తుత కలెక్షన్లు వీకెండ్ తర్వాత కూడా కొనసాగితే, ఏదో మ్యాజిక్ కచ్చితంగా జరుగుతుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ స్పీడ్ ఇలా కొనసాగితే, హిందీలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన 'లైగర్' సినిమాకు మంచి వసూళ్లు రావడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
Follow Us