విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్‌‌ ఎఫెక్ట్‌.. అద్దె కట్టలేని స్థితిలో పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన సినిమా 'లైగర్‌'. పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆగస్టు 25వ తేదీన భారీ అంచనాల మధ్య రిలీజైన 'లైగర్' సినిమా మొదటి షో అవ్వగానే, ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. దాంతో 'లైగర్' సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. సరైన ఓపెనింగ్స్‌ కూడా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

'లైగర్‌‌' సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కష్టాల్లో పడ్డారని తెలుస్తోంది. డాషింగ్‌ డైరెక్టర్‌‌గా సినిమా ఇండస్ట్రీలో స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న పూరీ, వరుస ఫ్లాపులతో అప్పట్లో అ‍ప్పులపాలయ్యారు.

అనంతరం 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో తన కెరీర్‌ను మరోసారి చక్కదిద్దుకున్నారు. అదే జోష్‌తో విజయ్‌ దేవరకొండ హీరోగా 'లైగర్‌' సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు పూరీ.

ఆశలు తలకిందులు..

పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కించిన 'లైగర్' సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని మూవీ టీం ఆశపడింది. అయితే ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్‌‌గా మిగిలింది.

బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు 'లైగర్‌‌' సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని 'లైగర్‌‌' సినిమా నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట.

'లైగర్‌‌' సినిమాను కరణ్‌ జోహార్‌తో కలిసి పూరీ, ఛార్మి కౌర్‌‌ నిర్మించారు. 'లైగర్‌' షూటింగ్‌ చాలా వరకు ముంబైలోనే జరిగింది. మూవీ షూటింగ్‌, ప్రమోషన్లలో భాగంగా గతేడాది ముంబైకి మకాం మార్చారు పూరీ జగన్నాథ్‌.

ముంబైలో ఓ విలాసవంతమైన సీ ఫేసింగ్‌ 4 బీహెచ్‌కే ప్లాట్‌ను రూ.10 లక్షలకు అద్దెకు తీసుకున్నారట. మెయింటనెన్స్‌ ఖర్చులతో కలిపి దాదాపు నెలకు రూ.15 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. సినిమా ఫ్లాప్ కావడంతో, ఆ ప్లాట్‌కు రెంట్‌ కట్టలేక ఖాళీ చేసినట్లు వినికిడి

హిట్‌ అయ్యుంటే మరో రేంజ్‌..

'లైగర్‌' సినిమా హిట్‌ అయ్యి ఉంటే పూరీ జగన్నాథ్‌ రేంజ్‌ మారిపోయేది.  ఈ మూవీ విజయం సాధించి ఉంటే, పూరీ కోసం బాలీవుడ్‌ అగ్ర హీరోలు, నిర్మాతలు క్యూ కట్టి ఉండేవారు. 'లైగర్‌' పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని, అదే జరిగితే తాను ముంబైలోనే సెటిల్‌ కావచ్చనే ఉద్దేశంతోనే.. విలాసవంతమైన ప్లాట్‌ను ఎంతో ఇష్టంగా తీసుకున్నారట పూరీ జగన్నాథ్‌.

దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన 'లైగర్‌' సినిమా మొదటి షో నుంచే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) డైరెక్ట్‌ చేయడమే కాకుండా, ఈ సినిమాకు ఒకానొక నిర్మాతగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 58 కోట్ల నుంచి రూ.60 కోట్లు మాత్రమే వసూలు చేసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

Read More : విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్‌‌’ ఎఫెక్ట్‌!.. సోషల్‌ మీడియాకు బ్రేక్ ఇస్తున్నా: చార్మి కౌర్

You May Also Like These