టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'లైగర్' (Liger). బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది.
'లైగర్' (Liger) సినిమా తాజాగా ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
కాగా.. ఈ సినిమా విడుదలకు మందు అభిమానులు, చిత్ర బృందం 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా రేంజ్‌లో అంచనాలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 'లైగర్' కలెక్షన్ వర్షం కురిపిస్తుందని భావించారు. కానీ ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఏదేమైనప్పటికీ, 'లైగర్'ను మేకర్స్ భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, లీడ్ రోల్స్‌తో పాటు లైగర్‌లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishnan), మైక్ టైసన్‌ల (Mike Tyson) పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ.35 కోట్లు తీసుకున్నట్లు, మైక్ టైసన్ 40 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అనన్య పాండే రూ.3 కోట్లు అందుకున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. 'లైగర్' సినిమాకు రమ్యకృష్ణ (Ramya Krishnan) అందుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda) తల్లిగా పవర్ ఫుల్ రోల్‌ను పోషించింది. అందుకుగానూ ఆమె భారీ రెమ్యునరేషన్ అందుకుందట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. 'లైగర్' మూవీకి రమ్యకృష్ణ కోటి రూపాయలు తీసుకుందట. ఇది ఓ స్టార్ హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని భారీ మొత్తం అనడంలో సందేహం లేదు.
Follow Us