మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన చిత్రం 'దృశ్యం'. ఇదే చిత్రం తెలుగులో కూడా వెంకటేష్ (Venkatesh) హీరోగా విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత 'దృశ్యం 2' చిత్రాన్ని కూడా తెరకెక్కించారు డైరెక్టర్ జీతూ జోసఫ్. 'దృశ్యం' ఫ్రాంచైసీకి మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి అభిమానులు ఉన్నారు.
ఓ యువకుడి హత్య కేసులో ఇరుక్కున్న తన కుటుంబాన్ని కాపాడడానికి ఓ కామన్ మ్యాన్ చట్టంతో చేసే పోరాటమే ఈ 'దృశ్యం' (Drishyam) కథ. అందుకే ఈ కథలో హీరో ప్రత్యర్థుల ఎత్తుకు పై ఎత్తులు ఎన్నో వేస్తాడు. సాక్ష్యాలను తారుమారు చేసి అందరినీ విస్తుపోయేలా చేస్తాడు. శవాన్ని మాయం చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా తన ఊరి పోలీస్ స్టేషన్‌లోనే పాతిపెడ్తాడు. ఇది దృశ్యం సినిమా ప్రథమార్థంలోని కథనం.
ట్విస్ట్‌లే ఈ సినిమాకి ప్రాణం
ఇక ద్వితీయార్థానికి వస్తే, కథానాయకుడు ఎప్పటికైనా తాను చేసిన తప్పు బయటపడుతుందని భావిస్తాడు. అందుకే టెక్నాలజీ మీద అవగాహన పెంచుకుంటాడు. థియేటర్ ఓనర్‌గా, సినిమా తీసే నిర్మాతగా బహుముఖ పాత్రలు పోషిస్తాడు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని అటెండర్‌తో స్నేహం చేసి, టెస్టింగ్‌కు వచ్చిన అస్తి పంజరాన్ని మాయం చేసి, మరోదాన్ని పెడతాడు. దీంతో ప్రత్యర్థులు ఓడిపోతారు. ఇదీ ద్వితీయ భాగంలోని కథనం.
మూడవ భాగం కథ ఇదేనా?
ఇప్పడు దృశ్యం మూడవ భాగం (Drishyam 3) కూడా తెరకెక్కడం విశేషం. అయితే ముగిసిన పోయిన కథని మళ్లీ ప్రత్యర్థులు ఎలా రీ ఓపెన్ చేస్తారన్నది ఈ సినిమాలోని ఆసక్తికరమైన అంశం. ఒకవేళ అలా కేసును రీ ఓపెన్ చేసినా, హీరో ఎలా తప్పించుకుంటాడన్నది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్.
అయితే ఈ ట్విస్ట్‌ను కూడా బహిర్గతం చేస్తూ, సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మూడవ భాగంలో కథానాయకుడు రాజకీయ నాయకుడి అవతారమెత్తుతాడని, అధికార పార్టీలో చోటు దక్కించుకోవడమే తన అభిమతంగా పావులు కదుపుతాడని చెబుతున్నారు. దీంతో, ఒకవేళ తన నేర నిరూపణ అయినా, తాను తప్పించుకోవడానికి మార్గం సుగమమవుతుందనేది ఈ కథలోని ట్విస్ట్.
మరి.. ఈ ట్విస్ట్ నిజమా కదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
Read More: ప్రేమించుకుందాం రా.. 25 ఏళ్ల సెలబ్రేషన్స్‌లో వెంకీ మామ (Venkatesh)
Follow Us