Telugu Movies: హిందీలో డబ్ అయిన తెలుగు సినిమాలు యూట్యూబ్‌లో దూసుకెళుతున్నాయి. తెలుగులో సినిమా హిట్టా, ఫట్టా అనే పట్టింపు లేకుండా అత్యధిక వ్యూస్ సాధించాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి తెలుగు చిత్రాలు సత్తా చాటుతున్నాయి. హిందీలో డబ్ అయిన ఇతర భాషల చిత్రాల కంటే మన తెలుగు సినిమాలే ముందు వరుసలో ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్, నితిన్, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ సినిమాలు హిందీ వర్షన్‌లో అదరగొడుతున్నాయి. హిందీలో డబ్ అయి యూట్యూబ్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాల విశేషాలు..
1. జయ జానకి నాయక (Jaya Janaki Nayaka)
జయ జానకి నాయక సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2017లో జయ జానకి నాయక సినిమా విడుదల అయింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ మూవిని నిర్మించారు. తెలుగులో (Telugu Movies) ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. కానీ హిందీ వర్షన్‌లో ఖూన్‌కార్‌గా రిలీజ్ అయి యూట్యూబ్‌లో దూసుకెళుతుంది. జయ జానకి నాయక 611 మిలియన్ల వ్యూస్ సాధించింది. అంటే 62 కోట్ల మంది ఈ సినిమాను యూట్యూబ్‌లో వీక్షించారు.
2. సీత (Sita)
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా సీత. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. 2019లో సీత సినిమా రిలీజ్ అయింది. ఎరియల్ స్టూడియోస్ బ్యానర్‌పై బెల్లంకొండ శ్రీనివాస్, అభినవ్ గోమఠం నిర్మించారు. హిందీలో సీతా రామ్‌గా డబ్ అయింది. ఈ సినిమా యూట్యూబ్‌లో 503 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. దాదాపు 50 కోట్లకు పైగా మంది ఈ సినిమాను వీక్షించారు.
3. నేను శైలజా (Nenu Sailaja)
రామ్ పోతినేని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా నేను శైలజా. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. నేను శైలజా చిత్రం 2016 జనవరి 1 న విడుదలైంది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మించారు. హిందీలో ది సూపర్ కిలాడీ పేరుతో నేను శైలజా సినిమాను డబ్ చేశారు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ చిత్రం హిందీలో 461 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. 46 కోట్ల మందికి పైగా యూట్యూబ్‌లో వీక్షించారు.
4. డీజే: దువ్వాడ జగన్నాథం ( DJ: Duvvada Jagannadham)
డేజే : దువ్వాడ జగన్నాథం సినిమాలో అల్లు అర్జున్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 2017 జూన్ 23 న ఈ సినిమా రిలీజ్ అయింది. నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌పై దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని నిర్మించారు. హిందీలో డబ్ డీజేగా డబ్ అయింది. యూట్యూబ్‌లో హిందీ వర్షన్ 461 మిలియన్ వ్యూస్ సాధించింది.
5. హలో గురు ప్రేమ కోసమే (Hello Guru Prema Kosame)
హలో గురు ప్రేమ కోసమే చిత్రం 2018 అక్టోబరు 18న విడుదలైంది. త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. హిందీలో దూమర్ ఖిలాడీ పేరుతో డబ్ అయింది. ఈ సినిమా హిందీ భాషలో యూట్యూబ్‌లో 432 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. అంటే 43 కోట్ల మంది ఈ సినిమాను చూశారు.
6. అ ఆ (A Aa)
అ ఆ 2016 జూన్ 2 న విడుదలైంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్‌లు నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. తెలుగు (Telugu Movies) తో పాటు హిందీలో కూడా అ ఆ పేరుతోనే డబ్ అయింది. హిందీలో డబ్ అయిన అ ఆ యూట్యూబ్‌లో 429 మిలియన్ల వ్యూస్ సాధించింది. 42 కోట్ల వ్యూస్ అన్నమాట.
7. డియర్ కామ్రేడ్ (Dear Comrade)
డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ సినిమా 2019, జూలై 26న విడుదలైంది. నిర్మాతలు నవీన్ ,వై రవి శంకర్, సివి మోహన్, యశ్‌లు నిర్మించారు. హిందీ వర్షన్ డియర్ కామ్రేడ్ యూట్యూబ్‌లో 320 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఈ సినిమాను 32 కోట్ల మంది ఇప్పటివరకు వీక్షించారు.
8. కవచం (Kavacham)
కవచం సినిమాను దర్శకుడు వినీత్ సాయి తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ నటించారు. 2018 డిసెంబరు 7న విడుదలైన ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై సాయి తేజ తాటి, కె. భరత్ రెడ్డి నిర్మించారు. హిందీలో ఇన్‌స్పెక్టర్ విజయ్‌గా డబ్ అయింది. యూట్యూబ్‌లో 315 మిలియన్లు. అంటే 31 కోట్ల మంది వీక్షించారు.
9. ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar)
ఇస్మార్ట్ శంకర్ 2019 జూలై 18న విడుదలైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ పోతినేని, నిధి అగర్వాల్ నటించారు. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై నిర్మించారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించారు. హిందీలో ఇస్మార్ట్ శంకర్ పేరుతో డబ్ అయి యూట్యూబ్‌లో 273 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.
10. తేజ్ - ఐ లవ్ యూ (Tej I Love You)
తేజ్ ఐ లవ్ యూ సినిమాలో సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. 2018లో జూలై 8న రిలీజ్ అయిన ఈ సినిమాకు ఎ.కరుణాకరణ్ దర్శకత్వం వహించారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామా రావు నిర్మించారు. హిందీలో సుప్రీం ఖిలాడీ -2 పేరుతో డబ్ అయింది. ఈ సినిమా హిందీ వర్షన్‌లో యూట్యూబ్‌లో 269 మిలియన్ల వ్యూస్ సాధించింది.
Follow Us