'మేజర్' కథానాయకుడు అడివి శేష్ (Advi Sesh) రైటింగ్ టాలెంట్‌కు అద్దం పట్టిన టాప్ 5 చిత్రాలివే !

అడివి శేష్ (Adivi Sesh) .. 'మేజర్' సినిమా సక్సెస్ తర్వాత ఆలిండియా స్టార్ అయిపోయాడు. 

అడివి శేష్ (Adivi Sesh) .. 'మేజర్' సినిమా సక్సెస్ తర్వాత ఆలిండియా స్టార్ అయిపోయారు. ఆ సినిమాలో మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ పాత్రలో శేష్ అద్భుతంగా నటించారు. 26/11 మారణహోమంలో ఒకవైపు ముష్కరులను తుదముట్టిస్తూనే, మరోవైపు ఎందరో అమాయకులకు ప్రాణదాతగా నిలిచి, తుదిశ్వాస విడిచిన సందీప్ పాత్రలో శేష్ జీవించేశారని చెప్పవచ్చు. అయితే అడివి శేష్ (Adivi Sesh) లో ఒక గొప్ప నటుడే కాదు, ఓ మంచి రచయిత కూడా ఉన్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు ?

అడివి శేష్ (Adivi Sesh) తను నటించిన చాలా సినిమాలకు కథా సహకారం, స్క్రీన్ ప్లే కూడా అందించారు. తను డైరెక్ట్ చేసే సినిమాకు కూడా దాదాపు స్క్రిప్ట్ వర్క్ ఆయనే చేసుకుంటారు. అలా ఆయన కథ సహకారం అందించిన కొన్ని చిత్రాల వివరాలు ఈ రోజు మీకోసం ప్రత్యేకం 

అడివి శేష్ కథా సహకారం అందించిన చిత్రాలు

కర్మ  (Karma) : అడివి శేష్ నటించిన తొలి చిత్రం 'కర్మ'. ఈ చిత్రానికి ఆయనే రైటర్, డైరెక్టర్ కూడా. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సాంకేతిక నిపుణులతో పాటు, హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకి పనిచేశారు. 

ఓ భారీ రోడ్డు ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నాక, ఆ సంఘటన ప్రేరణతో అడివి శేష్‌కు  'కర్మ' అనే పేరుతో ఒక  స్క్రిప్ట్ రాయాలని అనిపించిందట. అనుకున్నదే తడవుగా, ఆయన ఈ కథను రాసేశారు. హిందూ పురాణాలలోని కొన్ని పాత్రలు మనకు ఈ కథలో కనిపిస్తాయి. 

కిస్ (Kiss) :  ఇదో రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ చిత్రానికి కథను అడివి శేష్ రాశారు. అలాగే ఆయనే దర్శకత్వం వహించారు. ప్రియ బెనర్జీ ఈ సినిమాలో కథానాయికగా నటించారు. 24 గంటల్లోనే ప్రేమలో పడిన ఓ జంట కథ ఈ 'కిస్'. 

క్షణం (Kshanam) : రవికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడివి శేష్ కథను అందించారు. ఇందులో అడివి శేష్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా నటించారు. ఇదో మర్డర్ మిస్టరీ చిత్రం. భగ్న ప్రేమ, కిడ్నాప్, హత్య.. ఇలా వివిధ కోణాలలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాకు గాను దర్శకుడు రవికాంత్‌తో పాటు, అడివి శేష్‌‌కు కూడా ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డు లభించింది. 

 

గూఢచారి (Goodachari) : ఫిల్మ్ కంపానియన్ ప్రకటించిన 25 ఉత్తమ తెలుగు చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్న సినిమా 'గూఢచారి'. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, మళ్లీ అడివి శేషే కథను అందించారు. అలాగే కొంత స్క్రీన్ ప్లే ప్లే వర్క్ కూడా చేశారు.  

కొత్త తరం 'రా' ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే 'త్రినేత్ర' సంస్థలో చేరి, అనతికాలంలోనే రాటుదేలిన వ్యూహకర్తగా మారిపోతాడు గోపి (అడివి శేష్). ఇదే క్రమంలో, తనను కబళించబోయే కొత్త ప్రమాదాలను ఎలా నిరోధించగలిగాడు అన్నదే ఈ చిత్రకథ. 

 

మేజర్ (Major) : అడివి శేష్ ఈ సినిమాకు కథను అందించారు. అలాగే మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ పాత్రలో ఉత్తమ నటననూ ప్రదర్శించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో, భావోద్వేగ సన్నివేశాలలో తన నటనా ప్రతిభనంతా చూపించారు. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌నూ అందించారు. శశికిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో అడివి శేష్ హిందీ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టారు. 

ఈ పై చిత్రాలకు అడివి శేష్ కథలు అందించారు.

Read More : మేజ‌ర్ (Major) భారతీయుల హృద‌యాల‌ను తాకింది : అడ‌వి శేష్ (Adivi Sesh)

Credits: Instagram
You May Also Like These