Telugu Music Video Songs: 2022లో అత్యధిక వ్యూస్ సాధించిన టాలీవుడ్ వీడియో సాంగ్స్..

Telugu Music Video Songs : 2022లో కళావతి, నాటు నాటు, డీజే టిల్లు వంటి పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

2022 Most Viewed Telugu Video Songs: 2022లో విడుదలైన టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవల్‌లో విజయాన్ని సాధించాయి. అంతేకాదు బ్లాక్ బాస్టర్ హిట్లతో తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. సినిమా కథతో పాటు పాటలు కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. మహేష్ బాబు 'కళావతి' పాటలో చేసిన మ్యాజిక్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి 'నాటు నాటు' అంటూ రచ్చ చేశారు. ఇక 'టిల్లు అన్న డీజే పెడితే' ఎంజాయ్ డబుల్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్. 2022లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం..

సర్కారు వారి పాట - కళావతి (235M)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన 'సర్కారు వారి పాట' 2022లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్‌ సాధించాయి. 'కళావతి' సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసింది.ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. తమన్ సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్‌ కొత్త స్టెప్పులు క్రియేట్ చేసి కళావతి సాంగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. యూట్యూబ్‌లో 'కళావతి' పాట 235 మిలియన్ వ్యూస్ సాధించింది.

డీజే టిల్లు - టిల్లు అన్న డీజే పెడితే (212M)

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన సినిమా 'డిజే టిల్లు' లోని 'టిల్లు అన్న డీజే పెడితే పాట' ఓ రేంజ్‌లో హిట్ అయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలో జోష్ నింపిన ఈ పాట 212 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ పాటను రామ్‌ మిర్యాల అద్భుతంగా ఆలపించారు. 'డీజే టిల్లు' సినిమాకు శ్రీచరణ్‌ పాకాల సంగీతం సమకూర్చారు. భాను మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 

ది వారియర్ - బుల్లెట్ బండి (129M)

'ది వారియర్' సినిమాలోని 'బుల్లెట్ బండి' సాంగ్‌ హిట్ పాటగా నిలిచింది. ఈ పాటలో రామ్, కృతి శెట్టి డాన్సులతో అదరగొట్టారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. తమిళ నటుడు శింబు, గాయని హరిప్రియ ఆలపించారు. ఈ సాంగ్‌కు శ్రీమణి సాహిత్యం అందించారు.  

ఆర్ఆర్ఆర్ - నాటు నాటు (107M)

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గొప్ప సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలో నటించి మెప్పించారు. 'నాటు నాటు' అంటూ సాగిన పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన స్టెప్పులు ఇండియన్స్‌తో పాటు విదేశీయులను మెప్పించాయి.

'నాటు నాటు' పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్ డాన్స్ స్టెప్పులు అద్భుతంగా కంపోజ్ చేశారు.  కాస్టూమ్ డిజైనర్‌గా రమా రాజమౌళి వ్యవహించారు.

భీమ్లా నాయక్ - భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ (103M)

పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాలోని "భీం భీం భీం.. భీమ్లా నాయక్" ఈ ఏడాదిలో రిలీజ్ అయిన పాటల్లో స్పెషల్ సాంగ్. ఈ పాటను ఇప్పటి వరకు 103 మిలియన్ల మంది వీక్షించారు. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. తమన్ సంగీతం అందించారు. తమన్, శ్రీకృష్ణ, ప్రుద్వీ చంద్ర, రామ్ మిర్యాల ఆలపించారు. 

మాచర్ల నియోజకవర్గం - రా రా రెడ్డి (79M)

ఈ ఏడాది రిలీజ్ అయిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలోని 'రా రా రెడ్డి' పాట యూట్యూబ్‌లో దుమ్ము రేపింది. నితిన్, అంజలి కలిసి రాను రాను అంటూనే చిన్నదో అంటూ చేసిన డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. ఈ పాటను కులశేఖర్ లిరిక్స్ రాశారు. 

బంగార్రాజు -  బంగారా (75 M)

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య నటించిన 'బంగార్రాజు' 2022లో మొదటి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని 'బంగారా' సాంగ్ యూట్యూబ్‌లో 75 మిలియన్ వ్యూస్ సాధించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఈ పాటను మధు ప్రియ, అనూప్ రూబెన్స్ ఆలపించారు. భాస్కర్ భట్ల లిరిక్స్ రాశారు. శిరీష్ కుమార్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో (66M)

'ఆర్ఆర్ఆర్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమడు పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో 'కొమురం భీముడో' అంటూ సాగిన పాటలో ఎన్టీఆర్ హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ పాట యూట్యూబ్‌లో 66 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ పాటను ఎం.ఎం. కీరవాణి అద్భుతంగా స్వరపరిచారు. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాయగా.. కాలభైరవ కొమురం భీముడో పాటను ఆలపించారు.

సీతారామం - ఓ సీత (40M)

‘ఓ సీతా- హే రామా’ పాట సంగీత ప్రేమికుల మనసులో నిలిచిపోయిది. హీరో దుల్కర్ సల్మాన్‌కు సూపర్ హిట్ ఇచ్చిన 'సీతారామం' (Sita Ramam) సినిమాలోని 'ఓ సీత పాట' యూట్యూబ్‌లో దూసుకెళుతోంది. ఇప్పటి వరకు ఈ పాటకు 40 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ సాంగ్‌ను అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఎస్పీ చరణ్, రమ్య బెహరా అద్భుతంగా ఆలపించారు. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో నటించారు.

సీతారామం -  ఇంతందం దారి మళ్లిందా (36M)

'సీతారామం' చిత్రంలోని ఇంతందం దారి మళ్లిందా అంటూ అందంగా సాగిన పాటను ఎస్పీ చరణ్ ఆలపించారు. కృష్ణ కాంత్ అద్భుతమైన పదాలతో లిరిక్స్ అందించారు. ఈ పాటను యూట్యూబ్‌లో ఇప్పటివరకు 36 మిలియన్ వ్యూస్ సాధించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. 'సీతారామం' సినిమా కథతో పాటు పాటలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించాయి. 

Read More: Telugu Actress - ఈ ఏడాది టాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేసిన హీరోయిన్లపై ప్రత్యేక కథనం...

 

You May Also Like These