టాలీవుడ్‌లో హీరో రామ్ పోతినేని (Ram pothineni) తన నటనతో రోజు రోజుకీ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ యంగ్ హీరో నటించిన 'ది వారియర్' సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మాస్ యాక్షన్ సినిమాగా 'ది వారియర్' విడుదల కానుంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదే సినిమాలో రామ్‌కు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ది వారియర్' కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు.
ఈ సినిమాతో రామ్ పోతినేని (Ram pothineni) బ్లాక్ బాస్టర్ హిట్ సాధించాలని భావిస్తున్నారు. అదే విధంగా దర్శకుడు లింగు సామి తమిళంతో పాటు తెలుగులోనూ తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారు.
ది వారియర్ ట్రైలర్ జూలై 1 న విడుదల అవుతోంది. అలాగే సినిమా జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ది వారియర్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం..
1.పోలీస్ ఆఫీసర్‌గా రామ్
రామ్ పోతినేని (Ram pothineni) ఇప్పటివరకు చేయని పాత్రలో 'ది వారియర్' సినిమాలో కనిపించనున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో రామ్ నటిస్తున్నారు. పోలీస్ సత్యగా రామ్ ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు.
2.గ్లామర్ డోస్ పెంచిన హీరోయిన్
రామ్ పోతినేని సరసన 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి నటిస్తున్నారు. ఉప్పెన తర్వాత కృతి శెట్టి విభిన్నమైన కథలున్న సినిమాల్లో నటిస్తున్నారు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో కృతి శెట్టి తన గ్లామర్‌తో అదరగొట్టారు.
ఈ సినిమాలో కృతి సిగరెట్ కూడా తాగి ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేశారు. ఇక 'ది వారియర్ సినిమాలో ఈమె 'విజిల్ మహాలక్ష్మీ' పాత్రలో కనువిందు చేయనున్నారు.
3.విలన్‌గా నటిస్తున్న హీరో
'ది వారియర్' చిత్రంలో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. ఆది పినిశెట్టి హీరోయిజంతోనే కాకుండా విలనిజంతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్‌గా ఆది పినిశెట్టి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి నటించిన ఈ సినిమాతో పాటు.. 'మోడరన్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
4. సాంగ్ రిలీజ్ చేసిన తమిళనాడు ఎమ్మెల్యే
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, హీరో, ఎమ్మెల్యే అయిన ఉదయనిధి 'ది వారియర్' సినిమా నుంచి 'బుల్లెట్' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులు సృష్టించింది.
5.తమిళ డైరెక్షన్
తమిళనాడులో యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో లింగుసామికి మంచి పేరుంది. తమిళ డైరెక్టర్ లింగు సామి దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
6.తమిళ్‌లో ది వారియర్
రామ్ పోతినేని ఇప్పటివరకు తెలుగు సినిమాల్లోనే నటించారు. ఈ యంగ్ హీరో మొదటి సారిగా తమిళ భాషలో కూడా సినిమా చేస్తున్నారు. 'ది వారియర్' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు.
7.డిస్టిబ్యూటర్‌గా రామ్ (Ram pothineni)
'ది వారియర్' సినిమాతో రామ్ పోతినేని డిస్ట్రిబ్యూటర్‌గా మారబోతున్నారు. వైజాగ్ ఏరియాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను రామ్ సొంతం చేసుకున్నారు. దాదాపు రూ. 4.5 కోట్ల రూపాయలతో రామ్ ఈ సినిమాను కొనుగోలు చేశారట.
8.ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే
'ది వారియర్' మూవీ విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసింది. 'ది వారియర్' థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే రూ. 40 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు సృష్టించాయి.
9.బుల్లెట్ సాంగ్ ట్రెండింగ్
ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన బుల్లెట్ సాంగ్‌ను, నిర్మాతలు తమిళ స్టార్ ఉదయనిధితో రిలీజ్ చేయించారు. ఈ పాట తమిళ్, తెలుగులో రిలీజ్ అయింది. బుల్లెట్ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌తో దుమ్ము లేపుతూ దూసుకెళుతుంది. ట్రెండింగ్‌లో ఉంటూ ట్రెండ్ సృష్టించింది.
10.హిందీలో డబ్బింగ్ రైట్స్ ఎంతంటే!
రామ్ (Ram pothineni) నటించిన 'ది వారియర్' సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరింది. ఈ చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్లకు అమ్ముడయ్యాయి.
Read More: దూసుకొస్తున్న 'ది వారియర్' ట్రైలర్.. రామ్ (Ram Pothineni) మాస్ యాక్షన్‌పైనే అందరి అంచనాలు!
Follow Us