Macherla Niyojakavargam Trailer: 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్.. డైలాగులతో అదరగొట్టిన నితిన్ (Nithiin)

'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam) సినిమా ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Hero Nithiin),'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’(Macherla Niyojakavargam). ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. డైరెక్టర్ ఏంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఎన్నో చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పని చేసి అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు.

మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా శనివారం సాయంత్రం 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.             

'ఇవాళ వైజాగ్ చాలా కొత్తగా కనిపిస్తోందిరా' అని నితిన్ (Hero Nithiin) చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. కాగా, ఈ సినిమాలో ఇందులో కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డిగా నితిన్ ఆకట్టుకున్నాడు. మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికలు లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న విలన్ రాజప్పగా సముద్రఖని ని చూపించారు. అయితే, రాజప్ప నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించాలని నిశ్చయించుకున్న సిద్దార్థ్.. అతనితో డైరెక్ట్ వార్ ప్రకటించాడు. కథేంటనేది ట్రైలర్ లోనే చెప్పే ప్రయత్నం చేశారు. 

"నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా (Trivikram Srinivas) పంచులు.. వీళ్ళేమో బోయపాటి శ్రీనులా యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. రాజమౌళి హీరోలా ఎలివేషన్ ఇవ్వాలా" వంటి డైలాగ్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఇక హీరోయిన్లుగా కేథరిన్ థ్రెసా అందాల ఆరబోతతో కనువిందు చేయనుండగా, కృతి శెట్టి నితిన్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Read More: ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ నుంచి 'అదిరిందే పసిగుండే' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..!

Credits: Instagram
You May Also Like These