V Vijayendra Prasad: తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖ కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో విజయేంద్ర ప్రసాద్‌ను నామినేట్ చేశారు. పలు రంగాలకు చెందిన వారిని నామినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఓ ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో విజయేంద్ర ప్రసాద్‌తో పాటు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా, పరుగుల రాణి పీటి ఉష, వీరేంద్ర హెగ్డేల పేర్లు ఉన్నాయి.
'బాహుబలి' ప్రథమ, ద్వితీయ భాగాలకు విజయేంద్ర ప్రసాద్ కథా రచయితగా వ్యవహరించారు. భారత చలన చిత్ర రంగంలో 'బాహుబలి' సినిమా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకు కథ రాసిన విజయేంద్ర ప్రసాద్‌కు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం నుండి అరుదైన గౌరవం దక్కింది.
రాజ్యసభకు ఆయన్ను నామినేట్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, భజరంగీ భాయీజాన్, మగధీర, రాజన్న, విక్రమార్కుడు, సై సినిమాలకు కథా సహకారం అందించారు.
విజయేంద్ర ప్రసాద్ రచనలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు : మోదీ
V Vijayendra Prasad: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయేంద్ర ప్రసాద్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. సినిమా రంగానికి విజయేంద్ర ప్రసాద్ చేసిన కృషిని కీర్తించారు. దశాబ్దాలుగా సినీ రంగానికి విజయేంద్ర ప్రసాద్ సేవలందిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. విజయేంద్ర ప్రసాద్ చేసిన కృషి వల్ల భారత సంస్కృతి విశ్వ వ్యాప్తమైందంటూ ట్విట్టర్‌లో తెలిపారు. రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్రప్రసాద్‌కు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ.
రాజ్యసభకు సినీ పరిశ్రమ నుండి ఇద్దరు ప్రముఖులకు స్థానం దక్కింది. రాష్ట్రపతి కోటాలో పాపులర్ రైటర్ విజయేంద్రప్రసాద్ (V. Vijayendra Prasad), సంగీత దర్శకుడు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేశారు. దక్షిణాది సినీ రంగం నుంచి వీరిద్దరు రాజ్యసభకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి విజయేంద్రప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేశారు.
Follow Us