Liger Digital Rights: విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్న 'లైగర్'.. భారీ ధరకు డిజిటల్ హక్కులు!

విజయ్ దేవరకొండ మూవీ 'లైగర్' మూవీ పోస్టర్స్ (Vijay Devarakonda Starrer Liger Movie Posters)

Liger Digital Rights: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'లైగర్'. టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ఒకటైన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఈ సినిమాను థియేటర్లలలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఇక, 'లైగర్' (Liger Movie) సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పూరీ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీని క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. 

ఇక‌, 'లైగర్' ట్రైల‌ర్‌లో విజ‌య్ దేవరకొండ (Vijay Devarakonda) మాస్ మేకోవ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. కేవ‌లం ట్రైల‌ర్‌తోనే మేక‌ర్స్‌ విధ్వంసం సృష్టించారు. ఇప్ప‌టివ‌ర‌కు లైగ‌ర్ ట్రైల‌ర్ అన్ని భాష‌ల్లో క‌లిపి 60 మిలియ‌న్ల వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా రైట్స్ కోసం  అప్పుడే పోటీ పడుతున్నారట.

ప్ర‌ముఖ దిగ్గ‌జ సంస్థ స్టార్ గ్రూప్ రూ.55 కోట్ల‌కు లైగ‌ర్ డిజిట‌ల్. శాటిలైట్‌ హ‌క్కుల‌ను (Liger Digital Rights) కొనుగోలు చేసింది. ఓ టైర్2 హీరోకు ఈ రెంజ్‌లో బిజినెస్ జ‌రుగుతుందంటే విశేషం అనే చెప్పాలి. పైగా విజ‌య్ న‌టించిన గ‌త మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంత‌గా బిజినెస్ చేయ‌లేదు. 

మరోవైపు 'లైగర్' సినిమాను బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ (Karan Johar) రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై బాలవుడ్‌లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి నిజంగానే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఇంత భారీ రేటుకు అమ్ముడయ్యాయో లేదో తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

పూరి జగన్నాథ్ (Puri Jagannath), విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయడమే కాకుండా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 'లైగర్' మూవీ తెరకెక్కింది. దాదాపు 160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Read More: 'లైగర్' సినిమాతో ఇండియా మొత్తం షేక్ అవ్వాలి.. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రౌడీ బాయ్!

You May Also Like These