టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో అనిల్ సుంకర (Anil Sunkara) ఒకరు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అగ్ర హీరోలతో పలు సినిమాలను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్', అక్కినేని అఖిల్ (Akhil Akkineni) తో 'ఏజెంట్' సినిమాలను నిర్మిస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర సినిమాలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్‌లో 'భోళా శంకర్' తెరకెక్కుతుంది. తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా తెలుగులో 'భోళా శంకర్' రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు హీరో అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న ఏజెంట్ సినిమాను అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మిస్తున్నారు.
భోళా శంకర్‌పై అనిల్ కామెంట్స్
అనిల్ సుంకర తాను నిర్మించే కొత్త సినిమాలపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇప్పటివరకు తన సినీ జీవితంలో చాలా సినిమాలు నిర్మించానని అనిల్ తెలిపారు. తాను నిర్మించిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయన్నారు. 'భోళాశంకర్', 'ఏజెంట్' సినిమాలు కూడా హిట్ అవుతాయనే నమ్మకం ఉందన్నారు.
'భోళా శంకర్' సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారన్నారు. చెల్లెలు సెంటిమెంట్ సినిమాగా 'భోళా శంకర్' కథ ఉన్నా.. అభిమానులకు కావాల్సిన కమర్షియల్ హంగులను... దర్శకుడు మెహర్ రమేష్ వెండితెరపై చూపించనున్నారని తెలిపారు.
'బాహుబలి' ప్రొడ్యుసర్లు గ్రేట్ - అనిల్ సుంకర (Anil Sunkara)
మల్టీస్టారర్ సినిమాలు నిర్మించే అవకాశం వస్తే తప్పకుండా ఒప్పుకుంటానని అనిల్ సుంకర అన్నారు. మల్టీస్టారర్ సినిమాల్లో రోలెక్స్ పాత్రలో మహేష్ బాబు లాంటి వాళ్లు నటిస్తే ఆ సినిమా లెవలే వేరన్నారు. అగ్ర హీరోలతో అలాంటి అవకాశం వస్తే వదులుకోన్నారు. పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించే అవకాశం వస్తే కచ్చితంగా నిర్మిస్తానని తెలిపారు.
'బాహుబలి' ప్రొడ్యూసర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేశారు. అంత బడ్జెట్ పెట్టి 'బాహుబలి'ని నిర్మించడం గొప్ప విషయం అన్నారు. 'ఏజెంట్' సినిమాను ఎలా నిర్మించామనేది వెండితెరపై తెలుస్తుందని నిర్వాత అనిల్ సుంకర తెలిపారు.
Read More : Agent Teaser: ఏజెంట్ టీజర్ రిలీజ్!.. దమ్ముంటే కాల్చండి అంటున్న హీరో అఖిల్ (Akhil Akkineni)
Follow Us