Advertisement

Krithi Shetty: 'ది వారియర్' ప్రమోషన్స్.. అఫీషియల్ లుక్ లో అదరగొట్టిన కృతి శెట్టి!

టాలీవుడ్ లో తాను చేసిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది కృతి శెట్టి (Krithi Shetty). 'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ అందాల ఆరబోత విషయంలో ఇప్పటి వరకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తాజాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న 'ది వారియర్'  సినిమా తమిళ తెలుగు భాషలలో ఏకకాలంలో రూపొందింది. ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అనే బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించారు. 

రామ్ హీరోగా నటించిన 'ది వారియర్' (The Warrior Movie) సినిమా విడుదల తేదీ దగ్గరపాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, కొన్ని పాటలు విడుదల చేయగా అన్నీ కూడా మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.

కృతి శెట్టి టీవీ యాడ్స్ లో నటిస్తూ 17 ఏళ్ల వయసులోనే హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'సూపర్ థర్టీ' అనే సినిమాలో ఒక స్టూడెంట్ పాత్రలో కనిపించింది ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. అనూహ్యంగా ఆమెకు 'ఉప్పెన' (Uppen Movie) సినిమా ఆఫర్ లభించింది. 

ఇక కృతి శెట్టి నటించిన 'ది వారియర్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా ఈ మధ్యనే ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి ఇప్పుడు తాజాగా తన ఫోటోషూట్ షేర్ చేయడం ద్వారా టాలీవుడ్ లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.  

Read More: The Warrior: ది వారియ‌ర్ - వంద‌ల‌ మంది డ్యాన్స‌ర్లు, మోడ‌ల్స్‌తో స్టెప్పులేయ‌నున్న రామ్ (RamPothineni)

Advertisement
You May Also Like These
Advertisement