Advertisement

Seerat Kapoor: హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తున్న శర్వానంద్ సినిమా 'రన్ రాజా రన్' హీరోయిన్ సీరత్ కపూర్!

మోడలింగ్ రంగం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సీరత్ కపూర్ (Seerat Kapoor). తెలుగు లో శర్వానంద్‌ హీరోగా నటించిన ‘రన్‌ రాజా రన్‌’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత హిందీలో జిద్.. తెలుగులో 'టైగర్', 'కొలంబస్', 'రాజుగారిగది 2', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు' సినిమాల్లో నటించింది. అయినా.. ఈ అమ్మడుకు రావాల్సినంత పేరు రాలేదు. ఇప్పుడు మళ్లీ మోడలింగ్‌లో రాణిస్తున్న ఈ బ్యూటీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు బాగా టచ్‌లో ఉంటోంది. 

‘రన్‌ రాజా రన్‌’ (Run Raja Run Movie) చిత్రంలో ‘బుజ్జి మా.. బుజ్జి మా’ సాంగ్‌ ఆమెకు మంచి పేరు తెచ్చింది. ముంబయిలో పుట్టి పెరిగిన సీరత్ కపూర్ కి చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఆసక్తి అందుకే చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకుని ఎప్పటికైనా సినిమా హీరోయిన్ కావాలని కలలు కంటూ ఉండేది. చదువు పూర్తయ్యాక ముందు మోడలింగ్ కూడా చేసిన ఆమె తన కల నెరవేర్చుకోవడం కోసం యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటన కూడా నేర్చుకుంది. సందీప్ కిషన్ సరసన టైగర్, అలాగే సుమంత్ అశ్విన్ పక్కన 'కొలంబస్' అనే సినిమాల్లో నటించింది. అయితే రెండు సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఆమెకు ఒక ఏడాది పాటు అసలు అవకాశాలు కూడా దక్కలేదు. చాలా కాలం తరువాత రాజు గారి గది అనే సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది. 

ఈ క్రమంలో సోషల్ మీడియా లో నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో (Seerat Kapoor Hot Photo Shoot) ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఎద అందాలను బయటపెడుతూ హాట్ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఈ పిక్స్ ఆలా షేర్ అయ్యయో లేదో అభిమానులు, ఫాలోయర్స్ వాటిని వైరల్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ చూసి ఎంత అందాన్ని నిర్మాతలు , హీరోలు ఎందుకు మిస్ అవుతున్నారంటూ కామెంట్స్ వేస్తున్నారు.

Read More: Hebah Patel: గ్లామర్ ఫోటోలతో హీటెక్కిస్తున్న 'కుమారి 21ఎఫ్' భామ హెబ్బా పటేల్..!

Advertisement
You May Also Like These
Advertisement