Advertisement

‘ఫిల్మ్‌ఫేర్’ (Filmfare Awards) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అల్లు అర్జున్ (Allu Arjun) హవా.. వీడియో వైరల్!

దక్షిణాది చలనచిత్ర రంగంలో విశేషంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్’ (Filmfare Awards) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుకను నిరాడంబరంగా జరపగా.. ఈ ఏడాది మాత్రం ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో 2020, 2021 సంవ‌త్స‌రాల‌కుగాను ఎంపికైన చిత్రాల‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు.

ఇక, ఈసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం దుమ్మురేపింది. ఏకంగా ఏడు విభాగాల్లో ఆ చిత్రం పురస్కారాలను ఎగరేసుకుపోయింది. ఉత్తమ చిత్రంగా ‘పుష్ప’ నిలిచింది. అలాగే ఈ మూవీకి డైరెక్షన్ చేసిన వహించిన సుకుమార్ ఉత్తమ దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సహాయనటుడిగా మురళీశర్మ, ఉత్తమ సహాయనటిగా టబు అవార్డులను దక్కించుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలోనూ ‘పుష్ప’ మూవీ పురస్కారానికి ఎంపికైంది.

పుష్ప–ది రైజ్’ సంగీత విభాగంలోనూ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాలో తనదైన ట్యూన్స్‌తో దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ను ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది. ఇక ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి’ అంటూ మెలోడి సాంగ్‌తో మ్యాజిక్ చేసిన సిద్ శ్రీరామ్ ఫిలింఫేర్ ఉత్తమ గాయకుడిగా నిలిచారు. అలాగే ‘ఊ అంటావా మావ’ అంటూ తన గాత్రంతో యూత్‌ను ఒక ఊపు ఊపిన సింగర్ ​ఇంద్రావతి చౌహాన్‌ ఉత్తమ గాయని అవార్డులు గెలుచుకున్నారు. 

Read More: "అల్లు అర్జున్ (Allu Arjun) చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తున్నా".. 'అల్లూరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement