Advertisement

'Like Share & Subscribe' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాచురల్ స్టార్ నాని (Hero Nani) చిలిపి చేష్టలు..!

టాలీవుడ్‌ యంగ్ హీరో సంతోష్‌ శోభన్ (Santosh Shobhan), 'జాతి రత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'Like Share & Subscribe'. నవంబరు 4న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోనిని జేఆర్సీ కన్వెన్షన్ లో శనివారం రాత్రి నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని (Hero Nani) హాజరయ్యారు.

అయితే ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) సహజంగానే చాలా హైట్ గా ఉంటుంది. అయితే అయ్యప్ప దీక్షలో ఉన్న నాని చెప్పులు వేసుకోకపోవడంతో.. ఫ‌రియా పక్కన తక్కువ హైట్‌ తో కనిపించారు. ఈ క్రమంలోనే మీడియా ఫోటోస్ తీస్తుండగా.. నాని కావాలనే అరికాళ్ళను పైపైకి ఎత్తుతూ చిట్టి హైట్ ను మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించారు. నాని చేసిన చిలిపి పనికి పక్కనే ఉన్న ఫ‌రియాతో పాటు మీడియా ప్ర‌ముఖులు కూడా న‌వ్వేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'Like Share & Subscribe Pre Release Event' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో నాని మాట్లాడుతూ.. 'గోల్కొండ హైస్కూల్‌' సినిమాలో శోభన్‌ నటనకు తాను ఇంప్రెస్‌ అయ్యానని, శోభన్‌కు అది మొదటి స్క్రీన్ అప్పియరెన్స్ అని అన్నాడు. శోభన్‌లో నన్ను నేను చూసుకున్నాని అన్నాడు. శోభన్ చాలా ప్రామిసింగ్ సబ్జెక్టుల్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. 'జాతిరత్నాలు' సినిమాలో ఫరియా అబ్దుల్లా నటన తనకు నచ్చిందని, ఫరియాకు విషెస్‌ కూడా చెప్పానన్నాడు. 

Read More: సంతోష్‌ శోభన్ (Santosh Shobhan), ఫరియా అబ్దుల్లా జంటగా Like, Share & Subscribe.. ఆసక్తికరంగా ట్రైలర్!

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement