ఆర్.ఆర్.ఆర్.(RRR) విడుదల అయిన మొదటి రోజు నుంచి రికార్డులను సృష్టిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సృష్టించిన అద్భుత చిత్రం 'రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్.)'. ఈ చిత్రం ఇటు ఇండియన్ రికార్డులతో పాటు.. అటు వరల్ట్ రికార్డులను కూడా బద్దలు కొట్టడం విశేషం. ఈ చిత్రం సినీ పరిశ్రమలో కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించింది. మరోవైపు అవార్డుల పంట కూడా పండిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఆర్.ఆర్.ఆర్ భారతదేశం సత్తాను తనదైన శైలిలో చాటుతోంది. ముఖ్యంగా, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నటనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కడం గమనార్హం.
హాలీవుడ్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ (RRR)
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టులలో ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆర్ఆర్ఆర్ (RRR) రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికన్ సినిమా "Everything Everywhere All at Once" నిలవడం విశేషం. ఏదేమైనా, ఉత్తమ చిత్ర విభాగంలో ఆర్.ఆర్.ఆర్ రన్నరప్‌గా నిలవడం తమకు ఎంతో సంతోషాన్ని పంచిందని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టుకు, ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా పోటీ పడలేదు. ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్ర విభాగంలో మరో 9 హాలీవుడ్ చిత్రాలతో పోటీపడడం గమనార్హం. ఉత్తమ చిత్రంగా తమ సినిమానే ఈ పోటీలో విజయం సాధిస్తుందని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ బలంగా నమ్మింది. అయినప్పటికీ, రెండో స్థానంలో నిలిచి ఆర్.ఆర్.ఆర్ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలిసేలా చేసింది.
అల్లూరి సీతారామరాజును పోలిన విప్లవ యోధుడి పాత్రలో రామ్ చరణ్ (Ram Charan), కొమురం భీమ్‌ని పోలిన సాయుధవీరుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఈ సినిమాలో నటించారు. ఇదే సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్'కు ఉత్తమ చిత్ర విభాగంలో ఆర్.ఆర్.ఆర్ (RRR) ఇటీవలే నామినేషన్‌ను పొందింది.
కలెక్షన్ల మోత మోగించిన ఆర్.ఆర్.ఆర్ (RRR)
ఆర్.ఆర్.ఆర్. చిత్రాన్ని 2022 మార్చి 25న రిలీజ్ చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించారు.
ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని రూ. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. 'బాహుబలి 2' తర్వాత 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో రాజమౌళి ఇండియన్ సినిమా రికార్డులను మరోసారి తిరగరాశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లను వసూలు చేసింది. హిందీలో ఆర్.ఆర్.ఆర్ రూ. 274.31 కోట్లను రాబట్టింది. ఇదే క్రమంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా బాక్సాఫీసు రికార్డులలో ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని పొందింది.
Follow Us