Heroine Laya: ట్రెండీ డ్యాన్సులతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ మాజీ హీరోయిన్ లయ..!

హీరోయిన్ లయ (Heroine Laya)

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో స్వయంవరం, ప్రేమించు (Preminchu Movie), లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు లయ. తెలుగుతో పాటు పలు భాషలలో దాదాపుగా టాప్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కూచిపూడి డ్యాన్సర్ అయిన లయ (Heroine Laya).. 2006లో గణేష్ గోరటి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్.

కాగా, అలనాటి ఈ అందాల తార ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్నారు. ఈ మాజీ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ మూవీస్ పై తనకున్న ఇష్టాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ నటి..షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

యూఎస్‌లో ఉంటున్న ఈ బ్యూటీ ఎప్పటికపుడు ట్రెండీ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ అందరినీ పలుకరిస్తుంటుంది. ఇప్పటికే లయ (Heroine Laya) అమెరికా వీధుల్లో చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సాంగ్‌తో నెటిజన్ల ముందుకొచ్చింది లయ. ఈ సారి తాను నటించిన హనుమాన్ జంక్షన్‌లోని ‘కిలకిలమని కలికి చిలక’ పాటకు స్టెప్పులేసింది.

హిట్ ట్రాక్‌ గోల్‌మాల్ సాంగ్‌కు తన పార్ట్‌నర్ సారికా రెడ్డితో కలిసి ఇరగదీసే డ్యాన్స్ చేసి నెటిజన్లను కళ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తోంది. ఈ డ్యాన్స్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది లయ. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు చివరగా రవి తేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కనిపించిన లయ.

Read More: Pakka Commercial Trailer ( పక్కా కమర్షియల్) : మీతో సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరో కాదురా.. విలన్!

You May Also Like These