Doshi First Look: 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) తాజా మూవీ 'దోషి' ఫస్ట్ లుక్ రిలీజ్..!

'దోషి' ఫ‌స్ట్‌లుక్ లో విజ‌య్(Vijay Antony)ఒక చేతితో క‌ర్ర‌ ప‌ట్టుకుని మ‌రో చేతిని జేబులో పెట్టుకుని గుబురు గ‌డ్డంతో మాస్సీ లుక్‌లో ఉన్నాడు.

Doshi First Look: 'బిచ్చ‌గాడు', 'డాక్టర్ సలీమ్' సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్‌ను ఏర్ప‌రచుకున్నాడు కోలీవుడ్ హీరో విజ‌య్ ఆంటోని. ఆయన నటుడు మాత్రమే కాదు. స్వరకర్త, నేపధ్య గాయకుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్, చిత్ర నిర్మాత కూడా. 'బిచ్చ‌గాడు' సినిమా త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ఆ స్థాయిలో ఈ హీరోకు మ‌రో హిట్టు ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో ఏడు సినిమాలున్నాయి. అందులో ‘దోషి’ ఒక‌టి. సీ.ఎస్ ఆముద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఇప్పటిదాకా మానవాళి చరిత్రలో జరగని క్రైమ్ డ్రామా కథగా ‘దోషి’ సినిమా ఉండనుంది. తాజాగా విడుదలైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో విజ‌య్ (Vijay Antony) ఒక చేతితో క‌ర్ర‌ను ప‌ట్టుకుని మ‌రో చేతిని జేబులో పెట్టుకుని గుబురు గ‌డ్డంతో మాస్సీ లుక్‌లో ఉన్నాడు. విజ‌య్ వెన‌కాల "త‌ను ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నించాడు. త‌ను ప్ర‌జ‌ల మ‌న‌సును గెలుచుకున్నాడు. త‌ను ప్ర‌జ‌ల కోసం పోరాడాడు. త‌ను ప్ర‌జ‌ల కోసం ఒంట‌రిగా నిలిబ‌డ్డాడు" అంటూ ఓ కొటేష‌న్ రాసుకొని ఉంది. 

‘దోషి’ (Doshi Movie) సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. తమీజ్ పాడమ్ లాంటి హిలేరియస్ స్పూఫ్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు సీఎస్ అముదన్ ఈసారి క్రైమ్ డ్రామా జానర్ లో ‘దోషి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజ‌య్‌కు జోడీగా నందితా శ్వేత, నంబెస్సాన్ ర‌మ్య‌, మ‌హిమా నంబియార్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

‘దోషి’ (Doshi Movie) సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి ధనుంజయన్, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. సీఎస్ అముదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి కన్నన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా గోపీ అమర్ నాథ్ వ్యవహరిస్తున్నారు.

Read More: హాట్ ఫోటో షూట్లతో సెగలు రేపుతున్న 'మాస్టర్' (Master Movie) బ్యూటీ మాళవిక మోహనన్..!

You May Also Like These