టాలీవుడ్ టాప్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. 'పుష్ప' (Pushpa) చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఈ స్టార్ హీరో, ప్రస్తుతం పలు యాడ్స్ లలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ ను ప్రచారకర్తగా నియమించుకోవాలని అనేక బ్రాండ్స్ భావిస్తున్నాయి. వాణిజ్య ప్రకటనల కోసం తన లుక్స్ కూడా మార్చుకుంటున్నాడు. సాధారణంగా ఈ పుష్పరాజ్ ఒక్కో యాడ్‌కు రూ.7.5 కోట్లు తీసుకుంటాడని సమాచారం. రెడ్ బస్, కోకా కోలా, అస్ట్రాల్, కేఎఫ్‌సీ, జోమాటో తదితర బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.
ఇటువంటి తరుణంలో.. లిక్కర్, గుట్కా బ్రాండ్‌కు ప్రచారం చేయడానికి నిరాకరించాడట. భారీగా రెమ్యూనరేషన్ ఇస్తామన్నా అందుకు అంగీకరించలేదట. ‘అల్లు అర్జున్‌ను (Allu Arjun) ఓ గుట్కా బ్రాండ్, లిక్కర్ కంపెనీ సంప్రదించాయి. ప్రచారకర్తగా వ్యవహరించమన్నాయి. రూ.10కోట్లను రెమ్యూనరేషన్‌గా చెల్లిస్తామని పేర్కొన్నాయి. కానీ, అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. గుట్కా, లిక్కర్ బ్రాండ్స్, సరోగేట్స్ ప్రచారాలకు బన్నీ వ్యతిరేకం’ అని అల్లు అర్జున్‌తో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ తన తర్వాతి మూవీ 'పుష్ప ది రూల్' (Pushpa The Rule) కోసం సిద్ధమవుతున్నారు. ఈ రెండో పార్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి పార్ట్ 'పుష్ప ది రైజ్' సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఈ చిత్రం అంతకు మించి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇక, ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
‘పుష్ప’ సంచలన విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు సుకుమార్ (Director Sukumar) ఇప్పటికే స్క్రిఫ్ట్ వర్క్‌ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న సమ్మె పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More: Allu Arjun: 'హానర్ హోమ్స్' బ్రాండ్ అంబాసిడర్ (Honor Homes) గా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!
Follow Us