Megastar Chiranjeevi: మెగాస్టార్ సినిమా 'అడవి దొంగ' చూపిస్తూ బామ్మకు సర్జరీ.. చిరంజీవి స్పందన ఇదే!

ఆపరేషన్ జరుగుతున్నంత సేపు ఆమె చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘అడవి దొంగ’ (Adavi Donga) సినిమా చూడడం విశేషం.

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) జరిగిన అరుదైన శస్త్ర చికిత్స ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ శస్త్ర చికిత్సకు..  మెగాస్టార్​ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ఓ కనెక్షన్ ఉందండోయ్ !

పూర్తి వివరాల్లో వెళితే..  హైదరాబాద్‌కు చెందిన ఓ 50 ఏళ్ల మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు పరీక్షలు చేశారు. తర్వాత ఆమె మెదడులో ఓ కణితిని గుర్తించారు. ఆ కణితిని తొలిగించడానికి ఆగస్టు 25న ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే ఆపరేషన్ చేస్తున్నంత సేపు కూడా, ఆమెను స్పృహలోనే ఉంచారు. అలా స్పృహలో ఉంచుతూనే,  అత్యంత క్లిష్టమైన వైద్య ప్రక్రియను పూర్తిచేశారు.  

అయితే చిత్రమేంటంటే, ఆపరేషన్ జరిగేటప్పుడు పేషెంట్ ఆలోచనలను మరల్చడానికి, ఆమెకు ఓ సినిమాను చూపించారు. దీంతో ఆమె చికిత్స జరుగుతున్నంత సేపు కూడా ఆ సినిమా చూస్తేనే ఉంది. చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ (Adavi Donga) సినిమాలో పూర్తిగా లీనమైపోయింది. తర్వాత, ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో ఆమెతో మాటలు కలుపుతూ.. విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేశారు.

ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యాక, ఈ ప్రక్రియ గురించి డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. ఇలా స్పృహలో ఉండగానే రోగి మెదడుకు సర్జరీ చేసే పద్ధతిని ‘అవేక్ క్రేనియాటోమీ’ అంటారని  తెలిపారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం అవ్వడంపై, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఘటన మీడియా ద్వారా చిరంజీవి (Megastar Chiranjeevi) దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన శుక్రవారం తన పీఆర్‌వో ఆనంద్‌ను గాంధీ ఆస్పత్రికి పంపించారు. రోగి వివరాలు తెలుసుకోమని తెలిపారు. ఆయన సూపరింటెండెంట్‌ రాజారావును కలవగా..ఆయన ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్య సిబ్బందిని రాజారావు పరిచయం చేశారు. తర్వాత చిరంజీవి పీఆర్‌ఓ ఆ వృద్ధురాలిని కలిసి మాట్లాడారు.

తాను చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానినని.. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ చూస్తూనే ఉన్నానని ఆమె తెలిపారు. మహిళ మాట్లాడిన వీడియోను ఆయన రికార్డింగ్ చేసి, చిరంజీవికి పంపించారు. దాంతో ఆ మహిళను రెండ్రోజుల్లో నేరుగా గాంధీ ఆస్పత్రికే వచ్చి పరామర్శిస్తానని మెగాస్టార్ చెప్పారు. అదేవిధంగా సర్జరీ చేసిన వైద్యులను కూడా చిరంజీవి అభినందించారు.

Read More: God Father Update: 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, చిరంజీవితో (Chiranjeevi) కలిసి స్టెప్పులేయిస్తున్న ప్రభుదేవా!

Credits: pinkvilla
You May Also Like These