Happy Birthday Trailer: వాడు ప్రొఫెషనల్ కిల్లర్ అయితే నేను పెయిన్ కిల్లర్.. 'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ !

'హ్యాపీ బర్త్ డే' మూవీ పోస్టర్స్ (Happy Birthday Movie Posters)

Happy Birthday Trailer: టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే’. 'మత్తు వదలరా'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా రూపొందిస్తోన్న రెండో సినిమా ఇది. ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం  జులై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా 'హ్యాపీ బర్త్‌డే' ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. దర్శకు ధీరుడు రాజమౌళి (Director SS Rajamouli) చేతుల మీదుగా బుధవారం ట్రైలర్‌ లాంచ్‌ అయ్యింది. కాగా థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం తుపాకీల చుట్టూ తిరగనుందని తాజాగా రిలీజైన ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది.

సర్రియల్ కామెడీ’  అనే జోనర్‌ని పరిచయం చేస్తూ ఓపెన్ చేసిన ఈ ట్రైలర్ కాస్త డిఫరెంట్ గా ఉంది. సినిమా షూటింగ్ కూడా చాలా వైవిధ్యంగా జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తం ఒక హోటల్ లాంటి సెటప్‌తో ఈ ట్రైలర్ సాగుతుంది. ట్రైలర్ లో లావణ్య తో (Lavanya Tripathi) పాటు వెన్నెల కిశోర్, సత్య, హర్ష ఇలా చాలా మంది కనిపించారు.

‘ఆవేశం అగ్గి పుల్ల లాంటిది.. ఒక్కసారే వెలిగించవచ్చు. కానీ ఆశయం లైటర్ ఎన్నిసార్లయినా వెలిగించవచ్చు”. ‘వాడు ప్రొఫెషనల్ కిల్లర్ అయితే.. నేను పెయిన్ కిల్లర్‘. ‘రైమింగ్ బావుంది కానీ.. టైమింగ్ దరిద్రంగా ఉంది‘ అనే డైలాగులు ట్రైలర్‌లో పేలాయి. చివర్లో ‘దివాలి పండగలా గన్స్ ఫైర్ చేసుకోవడం‘ ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఏదో కొత్త జోనర్ ట్రై చేసారని స్పష్టంగా తెలుస్తోంది. 

ట్రైలర్ మొత్తం డిఫరెంట్ కామెడీతో నింపేశారు. ఒక లైటర్‌ను దక్కించుకోవడం కోసం కొన్ని గ్యాంగ్స్ ప్రయత్నిస్తుంటాయి. ఆ లైటర్ స్పెషాలిటీ ఏంటో ప్రస్తుతానికైతే సస్పెన్స్. టాలీవుడ్ లో పేరున్న కమెడియన్స్ అందరూ ఈ ట్రైలర్‌లో కనిపించారు. గన్స్, గ్యాంగ్స్, గర్ల్స్ .. మొదలైన వాటితో సాగిన ఈ ట్రైలర్ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్‌ను కలిగిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రానికి కాల భైరవ (Kala Bhairava) సంగీతం అందించారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!

Read More: Happy Birtday Movie: లావణ్య త్రిపాఠి సినిమాకు నాగచైతన్య 'థాంక్యూ' మూవీ ఎఫెక్ట్.. విడుదల తేదీ మారింది!

You May Also Like These