Macharla Niyojakavargam: జులై 30న 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. అధికారిక ప్రకటన!

'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (Macharla Niyojakavargam) ను జూలై 30న గుంటూరులో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Macharla Niyojakavargam: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో నితిన్ ఒకరు. తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు ఈ హీరో. గతేడాది నితిన్ ఏకంగా మూడు సినిమాల‌తో సినీ అభిమానుల‌ను అల‌రించాడు. అయితే అందులో ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. 

ఈ నేపథ్యంలో నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. కృతిశెట్టి (Krithi Shetty), క్యాథిరీన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత దర్శకుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి స్వ‌రాల‌ను స‌మ‌కూర్చాడు. 

'మాచర్ల నియోజకవర్గం' నుంచి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా 'రారా రెడ్డి', 'అదిరిందే..' సాంగ్స్ యువతని మరింతగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ (Hero Nithiin) నుంచి చాలా రోజుల తర్వాత ఓ మాస్ సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆగష్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

'మాచర్ల నియోజకవర్గం' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేయనుంది చిత్ర యూనిట్. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (Macharla Niyojakavargam Trailer Launch Event) ను జూలై 30 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఎల్ ఈ ఎం స్కూల్ గ్రౌండ్ బ్రాడిపేట్, గుంటూర్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. 

Read More: ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ నుంచి 'అదిరిందే పసిగుండే' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..!

You May Also Like These