యాక్షన్ సినిమాలతో సత్తా చాటేస్తున్న నిఖిల్
టాలీవుడ్‌లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) కు చిన్న సినిమాలతో, పెద్ద హిట్‌లు కొడతాడనే పేరు ఉంది. ఈయన 'అర్జున్ సురవరం' తర్వాత స్పై (Spy) అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్పై సినిమా ఇంట్రో గ్లింప్స్‌ను ఇటీవలే నిర్మాతలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ (Garry BH) దర్శకుడుగా చేస్తున్న మొదటి సినిమా ఇది. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ఇప్పటికే సినీ అభిమానులు, ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 50 సెకన్ల పాటు మాత్రమే ఉండే, ఈ స్పై ఇంట్రో గ్లింప్స్‌లో మంచి పోరాట సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా, యాక్షన్ సీన్లలో నిఖిల్ పడిన కష్టం మనకు కనిపిస్తుంది. ఐదు భాషల్లో స్పై సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా ఐశ్వర్యా మీనన్ నటిస్తున్నారు.
నాలుగు సినిమాలతో బిజీబిజీగా నిఖిల్
'కార్తికేయ 2' సినిమా తర్వాత, హీరో నిఖిల్ 'స్పై' సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు, మరో రెండు సినిమాలు నిఖిల్ ఖాతాలో ఉండడం విశేషం. నిఖిల్ సాధారణంగా వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఈయన నటించిన 'కార్తికేయ 2' కూడా థ్రిల్లర్ సినిమాగానే రిలీజ్ కానుంది.
సముద్రం గర్భంలోని ద్వారకా నగర రహస్యాలను ఛేదించే కథాంశంతో 'కార్తికేయ 2' తెరకెక్కుతోంది. ఇదే క్రమంలో 'స్పై' సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ప్రధానంగా మంచు పర్వతాల నడుమ రూపొందించిన సన్నివేశాలలో, నిఖిల్ పడిన కష్టం మనకు గ్లింప్స్‌లో కనిపిస్తోంది.
ముఖ్యంగా, బుల్లెట్లు తీసుకుని తుపాకీల కోసం కొండల్లో వెతకడం.. ఇక తుపాకీలు కనిపించాక, బైక్‌పై ఎవరినో అనుసరించడం? ఆ తర్వాత బుల్లెట్ల వర్షం కురిపించడం? ఇలా చాలా ఆసక్తికరమైన సన్నివేశాలతో స్పై (Spy) ఇంట్రో గ్లింప్స్ సాగడం విశేషం.
'స్పై' సినిమాకు సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియోలోని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ ప్రేక్షకులు అంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా 'స్పై' రిలీజ్ కానుంది.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2022లో దసరా టైంలో స్పై (Spy) సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Follow Us