Liger: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'లైగర్' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజయ్ తన పాన్ ఇండియా సినిమా కోసం ఇండియా మొత్తం తిరుగుతున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటూ.. చిత్ర ప్రమోషన్లు కొత్తగా నిర్వహిస్తున్నారు.
అయితే ఇవే ప్రమోషన్లలో జరిగిన ఓ సంఘటన విజయ్ దేవరకొండకు చిక్కులు తెచ్చి పెట్టింది. విజయ్ దేవరకొండ ఓ ప్రెస్‌మీట్‌లో పొగరుగా వ్యవహరించారని, ఆయన పై పలువురు సోషల్ మీడియాలో నెగటివ్ పోస్టులు పెడుతున్నారు.
విజయ్‌కు పొగరా?.
'లైగర్' ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విజయ్ పొగరుగా వ్యవహరించారంటూ ప్రచారం జరుగుతోంది. జర్నలిస్టు ప్రశ్నలు అడుగుతుంటే.. విజయ్ తన కాళ్లను పైకెత్తి కూర్చున్నారనే వార్త వైరల్‌గా మారింది. అయితే విజయ్ క్యారెక్టర్ గురించి జర్నలిస్టులు మిశ్రమ రీతిలో స్పందించారు.
ఫేక్ ప్రచారం నమ్మవద్దు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ పట్ల దురుసుగా వ్యవహరించలేదని జర్నలిస్టులు క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా హీరో రేంజ్‌లో విజయ్ ఉన్నారని.. అతనితో మాట్లాడాలంటే బెరుకుగా ఉందని పేర్కొంటూ అదే విషయాన్ని విజయ్‌తో జర్నలిస్టులు చెప్పారన్నారు.
ఆ ప్రశ్నకు విజయ్ బదులిస్తూ 'తాను ఎంత ఎత్తుకు ఎదిగినా జర్నలిస్టులంటే గౌరవం ఉందని, జర్నలిస్టులు తమ కాలిపై కాలు వేసుకుని మరీ తనను ప్రశ్నలు అడగవచ్చని' విజయ్ తెలిపారన్నారు. తాను ఎంత పెద్ద స్టార్ అయినా ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పేందుకు విజయ్ కాళ్లు పైకి పెట్టి కూర్చున్నారన్నారు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విషయంలో జరిగింది ఒకటైతే... ప్రచారం మరోలా ఉంది. విజయ్ దేవరకొండ పొగరుగా వ్యవహరించారంటూ జరుగుతున్న ప్రచారం జర్నలిస్టులే ఫేక్ అని తేల్చేశారు. విజయ్‌కు తమకు జరిగిన సంభాషణను ఓ వీడియో రూపంలో ట్విట్టర్‌లో సదరు జర్నలిస్టు పోస్ట్ చేశారు.
Follow Us