టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా వరల్ట్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రజనీకాంత్ (Rajinikanth), రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఇదే చర్చ చిత్ర వర్గాల్లో మొదలైంది. రాజమౌళి కూడా తనకు రజనీకాంత్‌తో సినిమా తీయాలని ఉందని గతంలో చెప్పారు. అసలు వీరిద్దరి కాంబోలో సినిమా అనేది కుదిరే పనేనా?
రజనీతో సినిమా చేయాలని ఉంది : రాజమౌళి
రజనీకాంత్‌తో సినిమా తీయాలనే కోరిక దక్షిణాది దర్శకులకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తలైవా సినిమాకు ఇండియాతో పాటు విదేశాలలోనూ డిమాండ్ ఉంటుంది. ఇటీవలే తెలుగు దర్శకుడు రాజమౌళి కూడా రజనీకాంత్‌తో సినిమా తీయాలని ఉందని తెలిపారు. ఆ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రజనీకాంత్ సినిమాలంటే బాక్సాఫీసు వద్ద ఓ రేంజ్‌లో దూసుకెళుతుంటాయి. 'రోబో', '2.0' వంటి సినిమాలు కొత్త రికార్డులను కూడా తిరగరాశాయి. రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్' సినిమాలో నటిస్తున్నారు. అలాగే రాజమౌళి (SS Rajamouli) కూడా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో మహేష్ బాబుతో రాజమౌళి 'ఎస్ఎస్ఎంబి 29'ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమా ఉంటుంది. రాజమౌళి గతంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు దాదాపు మూడేళ్ల టైం తీసుకున్నారు. మరి మహేష్‌తో సినిమా పూర్తి చేయడానికి, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో? కోవిడ్ కారణంగా RRR సినిమా ఆలస్యంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
రాజమౌళి కల నెరవేరుతుందా!
ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబో సినిమా రిలీజ్ కావాలంటే మరో సంవత్సరం పట్టవచ్చు. ఇక రజనీకాంత్‌తో సినిమా అంటే మాములు విషయం కాదు. ఇలాంటి ప్రాజెక్టు ఒకటి డీల్ చేయాలంటే, రెండేళ్లు పడుతుంది. ప్రస్తుతం ఇదే విషయంపై సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తున్నారు. జక్కన్నతో రజినీ సినిమా చేస్తే.. అది కచ్చితంగా భారతీయ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పోస్టులు పెడుతున్నారు.
Read More: RRR: ఎన్టీఆర్ (NTR) పులిని ఎలా బంధించాడో తెలుసా!..మరోసారి తన ధీరత్వం చూపిన రాజమౌళి
Follow Us