Advertisement

Aa AmmayiGurinchi Meeku Cheppali Pre Release Event: ఒకే వేదికపై కనువిందు చేసిన టాలీవుడ్ ప్రముఖ నటులు, దర్శకులు

యంగ్ హీరో సుధీర్ బాబు (Sudhher Babu), 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా సినిమా ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali). దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) డైరెక్షన్‌లో సుధీర్ బాబు నటిస్తున్న మూడో చిత్రం ఇది.

నాలుగేళ్ళ క్రితం ఇంద్రగంటి-సుధీర్ కాంబినేషన్‌లో మొదటిసారి 'సమ్మోహనం' (Sammohanam) సినిమా వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే ఈ సున్నితమైన ప్రేమకథకు మంచి టాక్ రావడమే కాకుండా విజయం కూడా అందుకుంది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా వచ్చిన 25వ సినిమా ‘వి’లో కూడా సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.

గత రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఒకే హీరోతో కలిసి మూడు వరుస సినిమాలు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సెప్టెంబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండడంతో.. మూవీ మేకర్స్ ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను (Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event) మంగళవారం సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు.

చాలామంది ప్రముఖ నటులు, దర్శకులు ఈ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నాగచైతన్య (Naga Chaitanya), అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు.. అనిల్ రావిపూడి (Anil Ravipudi), హరీష్ శంకర్, పరశురామ్, వెంకీ కుడుములు, రాహుల్ సాంకృత్యాన్ వంటి దర్శకులు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event)లో తన పాత్ర తీరుతెన్నుల్ని వివరించాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో తాను చేసిన పాత్రకు కొంచెం తిక్క ఉంటుందని, అయితే దాంతో పాటు కొంత పైత్యం కూడా ఉంటుందని అన్నాడు. "ఈ సినిమాలో నేను ఫిలిం డైరక్టర్ గా చేశాను. ప్రతి దర్శకుడికి ఓ టేస్ట్ ఉంటుంది. దాన్ని కొంతమంది తిక్క అని కూడా ఉంటారు. అలాంటి తిక్క, పైత్యం ఉన్న దర్శకుడి పాత్రను నేను పోషించాను అని పేర్కొన్నారు.

కాగా.. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali) నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు వాళ్లు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. 

Read More: "మూడు సినిమాలు ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో చేయడం ఎంతో ఆనందంగా ఉంది": సుధీర్ బాబు (Sudhher Babu)

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement