Ranga Ranga Vaibhavanga: 'రంగ రంగ వైభవంగా' టైటిల్ సాంగ్ రిలీజ్.. వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) స్టెప్పులు అదుర్స్

హీరో వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) న‌టించిన'రంగ రంగ వైభవంగా'  సినిమా సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Ranga Ranga Vaibhavanga: టాలీవుడ్ మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) న‌టించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'రంగ రంగ వైభవంగా' సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌గా తెర‌కెక్కింది. ఈ సినిమాకు 'అర్జున్ రెడ్డి' త‌మిళ వెర్ష‌న్ తెర‌కెక్కించిన‌ గిరీసాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ తెర‌కెక్కిస్తున్నారు. 

స‌ర‌దాగా సాగిన టైటిల్ సాంగ్ 

'రంగ రంగ వైభవంగా'  సినిమా సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. అవుతుంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మేక‌ర్స్ టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. వెడ్డింగ్ పార్టీ సాంగ్ 'రంగ రంగ వైభవంగా' లిరిక్స్‌తో స‌ర‌దాగా సాగింది. రోల్ రైడా రాసిన ఈ పాట‌ను సాగ‌ర్, శ్రీనిష జే పాడారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. 

మామ‌య్య ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజున అల్లుడు వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) న‌టించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా విడుద‌ల అవ‌డం విశేషం. 'ఉప్పెన‌', 'కొండ పొలం' సినిమాల‌తో అద‌ర‌గొట్టిన వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించాల‌నుకుంటున్నారు. ఫ్లాపుల‌తో డీలా ప‌డిన కేతిక శ‌ర్మ కూడా స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. 

Read More: ‘రంగ రంగ వైభ‌వంగా’ ట్రైల‌ర్ రిలీజ్.. కొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) 

Credits: YouTube
You May Also Like These