The Ghost: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) బాలీవుడ్‌లోనూ కింగ్ అనిపించుకునేందుకు రెడీ అవుతున్నారు. నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'బ్రహ్మాస్త్రం' సినిమాతో బాలీవుడ్‌ను మెప్పించిన నాగ్.. 'ది ఘోస్ట్' సినిమాతో కూడా అలరించనున్నారట. ది ఘోస్ట్ సినిమాను హిందీలో రిలీజ్ చేసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారట.
కొత్త కథలో నటించిన నాగ్
నాగార్జున నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్' (The Ghost)సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. నాగ్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. 'ది ఘోస్ట్' సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5 తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
మహేష్ బాబు విడుదల చేసిన 'ది ఘోస్ట్' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ తల్లీ కూతుళ్లను కాపాడే ప్రయత్నంలో నాగార్జున ఎదుర్కొన్న సవాళ్లు ట్రైలర్‌లో ఆసక్తికరంగా కనిపించాయి. నాగార్జున్ ఫైట్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ది ఘోస్ట్' విడుదల కానుంది.
పాన్ ఇండియా సినిమానా!
'ది ఘోస్ట్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 'పుష్ప', 'కార్తికేయ2' వంటి తెలుగు సినిమాలు నార్త్ ఇండియాలో మంచి బిజినెస్ చేశాయి. అంతేకాకుండా నాగార్జున నటించిన 'వైల్ట్ డాగ్' సినిమాను ఓటీటీలో చూసిన నార్త్ ప్రేక్షకులు బాగుందంటూ కితాబిచ్చారు. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' సినిమాను కూడా హిందీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
అందుకోసం 'పుష్ప' చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన ముంబై డిస్ట్రిబ్యూటర్ మనీష్‌తో నాగార్జున చర్చలు జరిపారట. ఈ ప్లాన్ వర్క్అవుట్ అయితే 'ది ఘోస్ట్' సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.
Read More: The Ghost : 'ది ఘోస్ట్' ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు(Mahesh Babu)
Follow Us