టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 తేదీన 'పోకిరి' సినిమాను ప్రపంచవ్యాప్తంగా కొన్ని థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఇటీవలే 'పోకిరి' సినిమా 4K క్వాలిటీలో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'పోకిరి' సినిమా 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. మహేష్ బాబుకు బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన 'పోకిరి' సినిమాను మళ్లీ 16 సంవత్సరాల తర్వాత చిత్ర యూనిట్ విడుదల చేయడం విశేషం.
మహేష్ బాబు (Mahesh Babu), ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన 'పోకిరి' సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లో విడుదల చేశారు. దాదాపుగా 375 స్క్రీన్లపై స్పెషల్ షోలు వేశారు. ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 1.73 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. మహేష్ బాబు సినిమాకు ఇంత కలెక్షన్ రావడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
పోకిరి ప్రపంచ వ్యాప్త వసూళ్లు
- నైజాం - రూ. 69 లక్షలు
- సీడెడ్ - రూ. 13 లక్షలు
- ఉత్తరాంధ్ర - రూ. 25 లక్షలు
- ఈస్ట్ - రూ. 12 లక్షలు
- వెస్ట్ - రూ. 6 లక్షలు
- గుంటూరు - రూ. 13 లక్షలు
- కృష్ణ - రూ. 10 లక్షలు
- నెల్లూరు - రూ. 4 లక్షలు,
- తెలుగు రాష్ట్రాల్లో - రూ. 1.52 గ్రాస్
- మిగతా రాష్ట్రాల్లో - రూ. 4 లక్షలు,
- విదేశాల్లో - రూ. 16 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు - రూ.1.72 కోట్లు
మహేష్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజును వివిధ ప్రాంతాలలోని ఆయన అభిమానులు ఓ పండుగలా జరుపుకున్నారు. పలు చోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహేష్ బాబు పేరు మీద పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
Read More: మహేష్ బాబు (Mahesh) పుట్టినరోజు సందర్భంగా 'పోకిరి' స్పెషల్ షో.. గంటలోనే థియేటర్లన్నీ హౌస్ ఫుల్!
Follow Us