టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) బాల నటుడిగా తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. చైల్డ్ ఆర్టిస్టుగా తొమ్మిది చిత్రాల్లో నటించిన మహేష్ బాబు.. అప్పటి ప్రేక్షకుల ప్రశంసలూ అందుకున్నారు. ప్రముఖ చలనచిత్ర నటుడు, పద్మాలయా స్టూడియోస్ అధినేత కృష్ణ తనయుడిగా సుపరిచితుడైన మహేష్ బాబు నటననే తన కెరీర్‌గా ఎంచుకున్నారు. 'రాజకుమారుడు' చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు.
మహేష్ బాబు 'రాజకుమారుడు' సినిమా నుంచి 'సర్కారు వారి పాట' వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలలో నటించారు. మహేష్ బాబు నటనను ఎంత ఇష్టపడతారో.. కుటుంబాన్ని అంతే ప్రేమిస్తారు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, తనదైన పంథాలో ఇండస్ట్రీలో దూసుకెళుతున్నారు. తన అభిమానులకూ ఆదర్శప్రాయమవుతున్నారు.
మహేష్ పుట్టినరోజు పండుగ అంటున్న ఫ్యాన్స్
మహేష్ బాబు (Mahesh Babu) 1975 ఆగస్టు 9 తేదీన జన్మించారు. బాల నటుడిగా మహేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో తన 43 ఏళ్లను ఇటీవలే పూర్తి చేసుకున్నారు. తన కెరీర్‌లో మొత్తం 36 సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా 27 సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం తన 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
మహేష్ బాబు పుట్టిన రోజును వివిధ ప్రాంతాలలోని ఆయన అభిమానులు ఓ పండుగలా జరుపుకుంటున్నారు. పలు చోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహేష్ బాబు పేరు మీద పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
పోకిరి రీ రిలీజ్
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా 2006 లో విడుదలై, బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన 'పోకిరి' సినిమాను ఇటీవలే 4కె వెర్షన్‌లో రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 చోట్ల 'పోకిరి' రీ రిలీజ్ అయింది. ఆన్‌లైన్ బుకింగ్ తెరిచిన కొద్ది క్షణాల్లోనే, ఈ సినిమా టిక్కెట్లు అమ్ముడవడం విశేషం.
ఈ రోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు' అనే హ్యాష్ ట్యాగ్‌తో ఆయన అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి మహేష్ బాబు హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్నాయి.
Read More: మహేష్ బాబు (Mahesh) పుట్టినరోజు సందర్భంగా 'పోకిరి' స్పెషల్ షో.. గంటలోనే థియేటర్లన్నీ హౌస్ ఫుల్!
Follow Us