కృష్ణంరాజు (Krishnam Raju) ను చివ‌రి సారి వెంటిలేటర్‌పై చూసిన ప్ర‌భాస్ (Prabhas)!.. రేపు మ‌ధ్యాహ్నం అంత్య‌క్రియ‌లు

కృష్ణంరాజు (Krishnam Raju) త‌మ్ముడు కుమారుడైన ప్ర‌భాస్ (Prabhas) కూడా తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరోగా ఎదిగారు.

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టులు, నిర్మాత రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అనారోగ్యంతో క‌న్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణం రాజు దాదాపు 187 చిత్రాలలో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచారు. విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో రెబ‌ల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు.

కృష్ణంరాజు సోదరుడి కుమారుడైన ప్ర‌భాస్ కూడా తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరోగా ఎదిగారు. పెద్ద‌నాన్న ఆస్ప‌త్రిలో చేర‌గానే ప్ర‌భాస్ (Prabhas) షూటింగ్ నుంచి ఆస్ప‌త్రికి చేరుకున్నారు.  

కృష్ణంరాజు, ప్ర‌భాస్‌ల మ‌ధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్ప‌ది. ప్ర‌భాస్ మొద‌టి సినిమా "ఈశ్వ‌ర్‌" ను కృష్ణంరాజు క్లాప్ కొట్టి ప్రారంభించారు. పాన్ ఇండియా హీరోగా  ప్ర‌భాస్ ఎద‌గ‌డం త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని కృష్ణంరాజు ప‌లు సంద‌ర్భాల‌లో అంటుండేవారు. కృష్ణంరాజును ప్ర‌భాస్ కూడా ఎంతో గౌర‌విస్తారు.

త‌న పెద్ద‌నాన్న‌ను చూసేందుకు వారానికి ఒక‌సారైనా కృష్ణంరాజు ఇంటికి వెళ్తుండేవారు ప్ర‌భాస్ (Prabhas). కృష్ణంరాజు అనారోగ్యంతో సెప్టెంబ‌ర్ 10న ఆస్ప‌త్రిలో చేరారు. ఆయ‌న్ను వెంటిలేట‌ర్‌పై ఉంచారు. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌భాస్ వెంట‌నే ఆస్ప‌త్రికి చేరుకున్నారు. వెంటిలేట‌ర్‌పైన త‌న పెద్ద‌నాన్న‌ను చివ‌రిసారి చూశారు.

అనారోగ్యంతో మృతి

కృష్ణంరాజు మ‌ర‌ణానికి సంబంధించిన కార‌ణాల‌ను ఏఐజీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మధుమేహం, పోస్ట్ కొవిడ్, కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన మ‌ర‌ణించారని వెల్ల‌డించారు. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది కృష్ణంరాజు కాలికి ఆప‌రేష‌న్ చేశారు.

అంతేకాకుండా దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు. గ‌త నెల 5న కోవిడ్ స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నార‌ని వెల్ల‌డించారు. కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే వెంటిలేటర్‌పై ఉంచామ‌న్నారు. 

రేపు మ‌ధ్యాహ్నం అంత్య‌క్రియ‌లు

కృష్ణంరాజు సెప్టెంబ‌ర్ 11 తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కృష్ణంరాజు పార్థివదేహాన్ని సెప్టెంబ‌ర్ 11 మ‌ధ్యాహ్నం 12 గంటలకు ఆయ‌న నివాసానికి తీసుకొస్తారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. రేపు ఉద‌యం కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఫిలిమ్ ఛాంబ‌ర్‌కు తరలించనున్నారు. ఆ త‌రువాత‌ కృష్ణంరాజు  అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

  

Read More: ఆదిపురుష్ (Adipurush )లో కృష్ణంరాజు న‌టిస్తున్నార‌ట‌.. ప్ర‌భాస్‌కు ఏమ‌వుతారో తెలుసా!

Credits: Twitter
You May Also Like These