Pushpa: టాలీవుడ్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు. పాన్ ఇండియా సినిమాగా 'పుష్ప' ఓ రేంజ్‌లో సక్సెస్ సాధించింది. ఈ సినిమా డైలాగులతో పాటు పాటలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అల్లు అర్జున్ డాన్సులు కూడా వైరల్‌గా మారాయి. ప్రస్తుతం 'పుష్ప' సినిమా పాటలు ఓ అరుదైన రికార్డును కొల్లగొట్టాయి.
ఐకాన్ స్టార్ల్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం 'పుష్ప'. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్లను షేక్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప' గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది.
తెలుగుతో పాటు హిందీలో కూడా కలెక్షన్ల సునామీని సృష్టించింది. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రం మరో రికార్డును సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 'పుష్ప' పాటలను కంపోజ్ చేశారు.
రికార్డు సృష్టించిన మ్యూజిక్
'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలు అన్ని కూడా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయి. 'శ్రీవల్లి', 'రా.. రా.. సామి', 'ఉ.. అంటావా మామా' పాటలు ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బబ్ 5 బిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది. అంటే 'పుష్ప' సినిమా పాటలు అన్ని భాషల్లో కలిపి యూట్యూబ్‌లో 500 కోట్ల వ్యూస్ రాబట్టాయి.
దక్షిణాదిలో కాకుండా ఇండియాలోనే పుష్ప పాటలు దుమ్ము లేపుతున్నాయి. అల్లు అర్జున్, రష్మిక మందన్న, సమంతల మాస్ స్టెప్పులు ప్రేక్షకులను మెప్పించాయి. 'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ మరో రికార్డును నమోదు చేశారు. భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి హీరో అల్లు అర్జున్ కావడం విశేషం.
కాసుల వర్షం కురిపించిన పుష్ఫ
'పుష్ప' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.350 కోట్లను వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ బాలీవుడ్‌లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. 'పుష్ప' సినిమాను నార్త్ ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. నార్త్‌లో అల్లు అర్జున్ ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. అంతేకాకుండా అల్లు అర్జున్ డైలాగులు, పాటలు నార్త్ ఇండియాలో కూడా తెగ హల్‌చల్ చేశాయి
'పుష్ప' సినిమా పాన్ ఇండియాలో సూపర్ హిట్ కావడంతో, అదే చిత్రానికి సీక్వెల్‌గా 'పుష్ప 2' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప 2' కోసం రూ. 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక దర్శకుడు సుకుమార్‌కు రూ. 50 కోట్ల పారితోషకం ఇవ్వనున్నారట.
Follow Us