Akhil Akkineni : అఖిల్ అక్కినేని బాలీవుడ్ సినిమా చేస్తున్నారా? అయితే నిర్మాత ఎవరు?

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) చలన చిత్ర నటుడిగానే కాకుండా, సీసీఎల్‌లో మంచి క్రికెట్ ఆటగాడిగా కూడా కితాబు పొందిన వ్యక్తి

అఖిల్ అక్కినేని (Akhil Akkineni).. అక్కినేని నాగార్జున, అమల దంపతులకు గారాల బిడ్డ. చిన్నప్పుడే 'సిసింద్రీ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్, హీరోగా మాత్రం ఇంకా బ్లాక్ బస్టర్ సక్సెస్ రుచిచూడలేదు. ఇప్పటికి నాలుగు సినిమాలు చేసిన అఖిల్, ఇటీవలే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంతో ఓ మాదిరి సక్సెస్ అందుకున్నాడు. 

అంతే కాదు.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో తన మేకోవర్ కూడా పూర్తిగా మార్చేశాడు. అలాగే సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిల మనసులను కూడా దోచేశాడు. ఇప్పుడు అఖిల్ (Akhil Akkineni) బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడని పలు వార్తలు ఫిల్మ్ నగర్ వర్గాలలో హల్చల్ చేస్తున్నాయి. 

కరణ్ జోహార్ నిర్మాతగా..
 
బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) అఖిల్‌ను బాలీవుడ్‌‌‌కు పరిచయం చేయనున్నారని కూడా ఓ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్త నిజమో.. రూమరో తెలీదు. ప్రస్తుతం 'ఏజెంట్' సినిమాలో అఖిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అక్కినేని అభిమానులకు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. 

అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. శివ, అంగారే, జక్మ్, మిస్టర్ బేచారా, ఖుదాగవా, క్రిమినల్, అగ్నివర్ష ఎల్ఓసీ కార్గిల్, బ్రహ్మాస్త్ర లాంటి బాలీవుడ్ చిత్రాలలో నాగ్ ఇప్పటికే నటించి, ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. దీంతో ఒకవేళ అఖిల్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే, నాగార్జున తనయుడు కాబట్టి తనను కూడా అక్కడివారు బాగానే రిసీవ్ చేసుకుంటారని కొందరు అంటున్నారు. 

ఫ్లాప్ సినిమా తర్వాత.. 

అయితే చిత్రమేంటంటే.. ఇటీవలే కరణ్ జోహార్ (Karan Johar) తెలుగు హీరో విజయ్ దేవరకొండను (Vijay Deverakonda) బాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కించిన 'లైగర్' సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ కరణ్‌కు దక్షిణాది చిత్రాల మీద ఇంట్రెస్ట్ తగ్గలేదట. అందుకే అఖిల్‌తో మరికొందరు దక్షిణాది నటులను బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకే ఆయన ఆసక్తి చూపిస్తున్నారట. 

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇటీవలే కరణ్ జోహార్ (Karan Johar) ఆఫీసులో నాగార్జున పలువురు విలేకరులకు కనిపించారట. దీంతో వీరిద్దరూ కలిసి ఓ కొత్త ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారేమో అనే అనుమానం తలెత్తింది. నాగార్జున ఇటీవలే కరణ్ జోహార్ ఒకానొక నిర్మాతగా వ్యవహరించిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో నటించిన సంగతి తెలిసిందే. 

Read More: అట్టహాసంగా అక్కినేని అఖిల్ (Akhil) 'ఏజెంట్' మూవీ ట్రైలర్ లాంఛ్.. ఫొటోలు వైరల్!

Credits: Instagram
You May Also Like These