Biggboss Season 6: 'బిగ్‏బాస్ సీజన్ 6' లో ఏడోవారం నామినేషన్స్ ప్రక్రియలో ఏకంగా 13మంది.. అత్యధికంగా రేవంత్ కే!

తాజాగా విడుదలైన ప్రోమోలో రేవంత్ ను ఎక్కువగా నామినేట్ చేయగా.. గీతూ రాయల్ (Geetu Royal) మాటలకు మరోసారి హర్ట్ అయ్యాడు బాలాదిత్య.

తెలుగు 'బిగ్‏బాస్ సీజన్ 6' (Biggboss Season 6) ఆరోవారం ఇంటి నుంచి పింకీ అలియాస్ సుదీప ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నేటినుంచి హౌస్ లో ఏడోవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 7వ వారంలో ఎలిమినేషన్స్ కోసం జరగబడే నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా జరిగింది. అయితే నామినేషన్ ప్రక్రియలో రేవంత్ బలైనట్టు కనిపిస్తోంది. 

ఆరోవారంలో ఇంటి కెప్టెన్ అయిన రేవంత్ (Singer Revanth).. పదే పదే పడుకోవడం, టాస్క్ లో భాగంగా అతని వల్ల పది శాతం బ్యాటరీ తగ్గిపోవడంతో అందరూ అదే కారణంతో నామినేట్ చేశారు. దీంతో రేవంత్ బాగానే హర్ట్ అయ్యాడు. నామినేట్ చేయడానికి మీకు మరో కారణం లేదని అర్థమైందంటూ రేవంత్ అందరి మీద కౌంటర్లు వేశాడు.

ఇక, తాజాగా విడుదలైన ప్రోమోలో రేవంత్ ను ఎక్కువగా నామినేట్ చేయగా.. గీతూ రాయల్ (Geetu Royal) మాటలకు మరోసారి హర్ట్ అయ్యాడు బాలాదిత్య. మంచి వాడిగా ఎలా ఉన్నావో అలాగే ఇంటి నుంచి వెళ్లిపోతే బాగుంటుంది అని గీతూ చెప్పగా.. నీకు సమాధానం చెప్పదలుచుకోలేదు అంటూ బాలదిత్య అన్నాడు. ఏ ఇంటి గురించి మంచిగా నేను ఆలోచిస్తున్నానో… అదే ఇల్లు నా గురించి ఎలా ఆలోచిస్తుందనేది ఆరోజు నాగార్జున గారు వీడియో చూపించినప్పుడు కాదు.. ఇప్పుడు ఎక్కువ క్లారిటీ వచ్చింది అంటూ బాధపడ్డాడు బాలాదిత్య. 

ఇక ఇనయ, శ్రీహాన్ (Srihan) మధ్య ఎప్పటిలానే డిస్కషన్ జరిగింది. నీ బిహేవియర్ నాకు నచ్చలేదని ఇనయ గురించి శ్రీహాన్ చెబుతూ.. హేళన చేశాడు. అర్జున్ ఆదిరెడ్డి మధ్య కూడా డిస్కషన్ జరిగింది. నువ్వు తక్కువ ఎంటర్టైన్ చేశావంటే.. నువ్వు తక్కువ చేశావని ఆదిరెడ్డి అర్జున్ అనుకున్నారు. నువ్వు నాలా స్టెప్పులు వేశావా? అని ఆదిరెడ్డి కౌంటర్లు వేశాడు.

చివరగా.. ఏడో వారంలో అర్జున్, రేవంత్, సత్య, ఆదిత్య, ఇనయ, ఫైమా, రాజ్, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్, మెరినా, శ్రీహాన్, వాసంతి ఇలా పదమూడు మంది నామినేట్ (7th Week Nomination Process) అయ్యారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాలి.

Read More: Biggboss Season 6: 'బిగ్ బాస్ సీజన్ 6' నుంచి ఎలిమినేట్ అయిన సుదీప (Sudeepa).. చివర్లో సింగర్ రేవంత్ పై కౌంటర్

 

Credits: Instagram
You May Also Like These