Sharukh Khan : షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’లో అతిథి పాత్రలో కనిపించబోతున్న తమిళ సూపర్ స్టార్ ఎవరు?

షారుఖ్ ఖాన్ (Sharukh Khan) సినిమా ‘జవాన్’ పై ఆయన అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. పూర్తిగా సరికొత్త పాత్రలో కనిపించడానికి షారుఖ్ బాగానే సన్నద్ధమవుతున్నారు.

షారుఖ్ ఖాన్ (Sharukh Khan).. బాలీవుడ్ పరిశ్రమలో కింగ్ అనే బిరుదును పొందిన గొప్ప కథానాయకుడు. ఈయన ప్రస్తుతం తమిళ అగ్ర దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ‘జవాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ టైటిల్ టీజర్‌‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఒకప్పుడు దర్శకుడు మురుగదాస్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అట్లీ ఆ తర్వాత.. రాజారాణి, పోలీసోడు, అదిరింది, విజిల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. 

దాదాపు 3 ఏళ్ల తర్వాత మళ్లీ అట్లీ (Atlee) మెగాఫోన్ పట్టాడు. అయితే ఈసారి తన పనితనాన్ని బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చూపించడానికి సిద్ధమయ్యాడు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 2 జూన్ 2023 తేదిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

‘జవాన్’ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే చిత్రంలో ప్రస్తుతం ఓ అగ్ర కథానాయకుడు అతిథి పాత్రలో నటించబోతున్నాడని ఓ టాక్ వినిపిస్తోంది. షారుఖ్ ఖాన్ (Sharukh Khan) తన చిత్రంలో గెస్ట్ రోల్ చేయవలసిందిగా నటుడు విజయ్‌ని కోరారట. దానికి ఆయన కూడా ఒప్పుకున్నారనేది ట్రేడ్ వర్గాల సమాచారం. 

విజయ్ (Vijay) గతంలో అమీర్ ఖాన్ నటించిన ‘3 ఇడియట్స్’ సినిమా తమిళ రీమేక్ 'నంబన్'లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే విజయ్ (Vijay) నటించిన 'తుపాకీ' చిత్రం కూడా హిందీలో 'హాలీడే' పేరుతో రీమేకైంది. ఇక ఉత్తరాది వారికి కూడా విజయ్ బాగా సుపరిచితమే. ఈయన నటించిన అనేక సినిమాలు డబ్ అయ్యి, యూట్యూబులో మంచి వ్యూస్‌ని సొంతం చేసుకుంటున్నాయి. 

‘జవాన్’ చిత్రంలో విజయ్ (Vijay) ఓ అయిదు నిమిషాల పాత్రలో కనిపిస్తారని పలు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రి, కొడుకులుగా డ్యుయల్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించే ఈ సినిమాని, రెడ్ చిల్లీస్ బ్యానరుపై షారుఖ్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. 

Read More: షారుఖ్ ఖాన్ సినిమా జ‌వాన్‌లో 'రానా ద‌గ్గుబాటి' (Rana Daggubati )... ఏ పాత్ర‌లో న‌టిస్తున్నారంటే?

You May Also Like These